YCP MLA Roja Fallen in a Swoon at AP Assembly Out Side

Ycp mla roja fallen in a swoon at ap assembly out side

Roja, YSRCP, MLA Roja, Assembly, AP

YCP MLA Roja Fallen in a Swoon at AP Assembly Out Side. Roja protesting at the assembly out side from the morning.

ITEMVIDEOS: సొమ్మసిల్లిపడిపోయిన ఎమ్మెల్యే రోజా

Posted: 03/19/2016 01:20 PM IST
Ycp mla roja fallen in a swoon at ap assembly out side

వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ ఆవరణలో సొమ్మసిల్లారు. నిన్నటి నుండి రోజా తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నారు. రోజాకు అసెంబ్లీ సమావే:శాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ హైకోర్ట్ మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అసెంబ్లీలోకి ప్రవేశించడానికి వీలులేకుండా అక్కడి భద్రతా సిబ్బందికి స్పీకర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. రెండున్నర గంటల పాటు మండుటెండలో మౌనదీక్ష చేసిన ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 9 గంటల నుంచి ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం, దానికితోడు ఎండలో ఉండటంతో ఆమె డీహైడ్రేషన్‌కు గురైనట్లు తెలుస్తోంది.

ఆమె తీవ్రంగా నీరసించారు. అయినా కూడా దీక్షాస్థలం నుంచి కదల్లేదు. తోటి మహిళా శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి రోజాను తన ఒళ్లో తల పెట్టించి పడుకోబెట్టారు. పలువురు ఎమ్మెల్యేలు ఆమెకు సంఘీభావంగా అక్కడే ఉన్నారు. కాగా వైసీపీ నాయకులు రోజాకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, ఉప్పులేటి కల్పన, గౌరు చరిత, పుష్పవాణి, కళావతి, రాజేశ్వరి తదితరలతో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా రోజాకు మద్దతు తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  YSRCP  MLA Roja  Assembly  AP  

Other Articles