MLA Vishnukumar Raju requested to allow to sit in last seat at the AP assembly

Mla vishnukumar raju requested to allow to sit in last seat at the ap assembly

YSRCP, BJP, Vishnukumar Raju, Chandrababu Naidu, AP, Assembly

MLA Vishnukumar Raju requested to allow to sit in last seat at the AP assembly. Vishnukumar Raju slams YSRCP MLAs.

అధ్యక్షా...లాస్ట్ బెంచ్ లో కూర్చుంటానన్న ఎమ్మెల్యే

Posted: 03/19/2016 11:00 AM IST
Mla vishnukumar raju requested to allow to sit in last seat at the ap assembly

ఏపి అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతూ న్యూస్ ఛానల్స్ కు భలే పని కల్పించారు. అయితే వైసీపీ నాయకుల నిరసనల మధ్యే స్పీకర్ సభను కొనసాగించారు. వైసీపీ నాయకుల నిరసన మధ్య గందగోళ పరిస్థితుల్లోనే స్పీకర్  ప్రశ్నోత్తరాలను నిర్వహించారు.  అధికార పార్టీ సభ్యులు మాట్లాడారు.  మధ్యలో లేచిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబును ఆకాశానికెత్తారు. అంతకన్నా ముందు అధ్యక్షా వెనక బెంజిలో కూర్చుంటాను అంటూ అడిగి మరీ కూర్చున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతూ... నినాదాలు చెయ్యడంతో బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వెనక బెంచ్ లో కూర్చుని మాట్లాడారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తుంటే  ప్రతిపక్షం అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులకు ఇంకితజ్ఞానం, సభ్యత లేదని అనుచిత వ్యాఖ్యలు చేశారు.  వైసీపీ సభ్యులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని హెచ్చరించారు.  విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతున్న సమయంలో వైసీపీ సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. వైసీపీ స్లోగన్స్‌ దెబ్బకు విష్ణుకుమార్ తాను వెనుక బెంచ్‌కు వెళ్లి మాట్లాడుతానని అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు.

ఇంతకంటే సిగ్గుమాలిన ప్రతిపక్షం మరొకటి ఉండదన్నారు.  ప్రభుత్వాన్ని  అండగా నిలవడంతో టీడీపీ సభ్యుల కంటే బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ అయిన విష్ణుకుమార్‌ రాజు చాలా దూకుడుగా వ్యవహరించారు.అనంతరం మైక్ అందుకున్న సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రపదజాలంతో వైసీపీని విమర్శించారు. నీచ నికృష్టమైన ప్రతిపక్షం అంటూ … జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించబోయారు. ఇంతలోనే స్పీకర్‌ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  BJP  Vishnukumar Raju  Chandrababu Naidu  AP  Assembly  

Other Articles