TDP MLA revanth Reddy spoke about debt

Tdp mla revanth reddy spoke about debt

TDP, TRS, Revanth Reddy, Telangana, Assembly, Debt

TDP MLA revanth Reddy spoke about debt. He told that TRS govt lending more debt for telangana state. People dont need number strategy bbut they need original development.

అప్పులు గురించి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్

Posted: 03/19/2016 07:47 AM IST
Tdp mla revanth reddy spoke about debt

చాలా కాలం తర్వాత తెలుగుదేశం తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లభించింది. దాంతో అప్పుల చిట్టా విప్పారు. టిఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన కేవలం 21 నెలల్లోనే లక్ష కోట్లకు పైగా రుణాలు చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊ బిలోకి నెడుతున్నారని ఆయన విమర్శించారు. శాసనసభలో నిన్న బడ్జెట్ పై సాధారణ చర్చలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు వాటాగా 1956 నుంచి 2004 వరకు రూ. 69,000 కోట్ల అప్పులు చేశారని, ఈ మధ్య కాలంలో 16 మంది ముఖ్యమంత్రులు పాలించారని రేవం త్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 21 నెలల్లోనే రూ.లక్ష కోట్లకు పైబడి అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆరోపించారు.

గొప్పల కోసమే అంకెలు పెద్దవి చేసి లక్షకోట్ల బడ్జెట్ పెడుతున్నారని, వాస్తవ బడ్జెట్ కాదని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో ఖర్చు పెడుతున్న తీరును గమనిస్తే, బడ్జెట్ దారితప్పినట్లుందన్నారు. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని డి మాండ్ చేశారు. ఇందుకోసం రుణమాఫీకి కేటాయించిన రూ.4,200 కోట్లతో పాటు, ముఖ్యమంత్రికి కేటాయించిన ప్రత్యేక అభివృద్ధి నిధి’ నుంచి రూ.4,300 కోట్లను అదనంగా మళ్లిస్తే రైతును అప్పల ఊబిలోంచి బయ టపడేయవచ్చని సూచించారు. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధికి రూ.500 కోట్లు కేటాయిస్తే చాలన్నారు. ‘అద్దాల మేడలు…. రంగుల గోడలు కాదు…. పౌరుల నైతిక అభివృద్ధి, జీవన ప్రమాణాలు పెరగాలి’ అని రాజ్యాంగ ని ర్మాత బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను ప్రభుత్వాలు ఆచరణలో పెట్టాల న్నారు. టిఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు చేపట్టి, ఇప్పటికే 80 శాతం పూర్తయిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు., ఆ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తే ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉం టుందని, ఇందుకోసం రూ.1,000 కోట్లు కేటాయిస్తే చాలని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌లను పూర్తిచేయాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  TRS  Revanth Reddy  Telangana  Assembly  Debt  

Other Articles