Flight From Dubai Crashes on Approach to Russian Airport

Flight from dubai crashes on approach to russian airport

Russian Flight, Boeing 737, flight crash

A Boeing 737 passenger jet crashed as it was landing at the Rostov-on-Don airport in southern Russia, the country’s Southern Regional Emergency Center said Saturday. All people on board have died, Russian state news agency Tass reported, citing an official at the emergency center.

కూలిన విమానం.. 61 మంది మృతి

Posted: 03/19/2016 09:34 AM IST
Flight from dubai crashes on approach to russian airport

రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి రష్యా వెళ్తున్న విమానం మరి కొద్ది సేపట్లో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 61 మంది చనిపోయారు. వీరిలో ఆరుగురు విమాన సిబ్బంది, 55 మంది ప్రయాణికులు ఉన్నారు. దక్షిణ రష్యాలోని రొస్తోవ్ ఆన్ డాన్ విమానావ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో బోయిగ్ 737-800 విమానం కూలిందని దక్షిణ ప్రాంతీయ ఎమర్జెన్సీ సెంటర్ తెలిపింది. ఈ ప్రమాదానికి పొగమంచు కారణమని ప్రాథమిక సమాచారం. విమానంలో ఉన్న వాళ్లందరూ మరణించినట్లు రష్యా అధికారిక వార్తాసంస్థ టాస్ తెలిపింది.

ఫ్లై దుబాయ్ విమానయాన సంస్థకు చెందింది ఈ విమానం. ప్రమాద ఘటనతో విమానాశ్రయాన్ని భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 7.30 గంటల వరకు మూసేసి ఉంచుతున్నట్లు స్పుత్నిక్ వార్తాసంస్థ తెలిపింది. మరోవైపు.. బోయింగ్ ఎయిర్‌లైన్స్ కూడా ఈప్రమాదంపై స్పందించింది. రష్యా నుంచి వస్తున్న కథనాల గురించి తమకు తెలుసని, తమ బృందం ప్రమాదం గురించి మరిన్ని వివరాలు సేకరిస్తోందని బోయింగ్ ఎయిర్‌లైన్స్ తమ ట్వీట్‌లో తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Russian Flight  Boeing 737  flight crash  

Other Articles