Now CMs, Governors, union & state mins to feature in govt ads

Supreme court lifts curb on photos of chief ministers in ads

Supreme Court,chief minister photo,government advertisements,Assembly Elections,Tamil Nadu election,West bengal election,Tamil Nadu Chief Minister J Jayalalithaa,AIADMK Tamil Nadu,Prime Minister photo,Election Commission

The Supreme Court of India allowed the use of photographs of chief ministers and union ministers in government advertisements in its order Friday,

ఇకపై ఆ ప్రకటనలు కలర్ ఫుల్.. దర్శనమియ్యనున్న ముఖ్యమంత్రులు

Posted: 03/18/2016 05:50 PM IST
Supreme court lifts curb on photos of chief ministers in ads

ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ప్రకటనలు కలర్ ఫుల్ గా కనిపించనున్నాయి. ప్రభుత్వాలు జారీ చేసే ప్రకటనలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మంత్రుల కూడా కనిపించనున్నారు. గతంలో మాదిరిగానే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రకటనలను జారీ చేసుకోవచ్చు. ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి సహా ఇకపై ఆయా శాఖకు సంబంధించిన రాష్ట్ర మంత్రులు కూడా ప్రకటనలలో దర్శనమియ్యనున్నారు. ఈ మేరకు దేశ సర్వోన్నత న్యాయస్థానం ధర్మసానం సూచించింది.

ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలలో గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు సంబంధిత శాఖ మంత్రి ఫొటోలు కూడా పెట్టుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ అంశంపై విచారించింది. ఇంతకుముందు ప్రభుత్వ ప్రకటనలలో కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ఫొటోలను మాత్రమే ప్రచురించాలి తప్ప గవర్నర్, ముఖ్యమంత్రి తదితరుల ఫొటోలు వాడకూడదని ఇచ్చిన తీర్పును బెంచ్ సవరించింది.

ఈ విషయమై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరుతూ అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టును ఆశ్రయించింది. ఈ ఉత్తర్వులు దేశ సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా ఉన్నాయని వాదించాయి. దీంతో విచారణను స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ తన తీర్పును సవరిస్తూ నిర్ణయాన్ని వెలువరించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  govenrment ads  chief minister photos  

Other Articles