Sri Lanka beats Afghanistan in World Twenty20

Sri lanka beats afghanistan in world twenty20

Dilshan, Srilanka, T20 world cup, India, Afghanistan, Tillakaratne Dilshan

Opener Tillakaratne Dilshan has smacked an unbeaten 83 off 56 balls to steer defending champion Sri Lanka to a six-wicket win over a spirited Afghanistan in the World Twenty20.

దుమ్మురేపిన దిల్షాన్.. ఆక్కట్టున్న ఆప్ఘనిస్తాన్

Posted: 03/18/2016 07:19 AM IST
Sri lanka beats afghanistan in world twenty20

టీంలో మంచి ఆటగాళ్లే ఉన్నా... వరుసగా అపజయాలే.. అపజయాలతోనే ఇండియాలోకి అడుగుపెట్టిన శ్రీలంక టీంకు నిన్నటి మ్యాచ్ మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఆప్ఘనిస్తాన్ మీద శ్రీలంక గ్రేట్ విక్టరీ శ్రీలక ఆటగాళ్లలో, అభిమానుల్లో పునరుత్తేజాన్ని నింపింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఇంకోటి కూడా ఉంది. శ్రీలంక లాంటి పెద్ద టీంతో ఆడినా. ఆఫ్టనిస్థాన్ చివరి వరకు పోరాడి ఓడిపోయింది. ఆప్ఘనిస్తాన్ టీం మీద ఎవరికి పెద్దగా అంచనాలు లేవు.. అయినా కూడా శ్రీలంక ప్లేయర్లను ఎదురించి మరి మంచి లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా దిల్సాన్ దుమ్మురేపాడు.

నిన్నటి తొలి లీగ్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో లంక విజయం సాధించింది. ఆఫ్ఘన్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యఛేదనలో మరో ఏడు బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి గెలుపు అం దుకుంది. గత కొన్ని మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమవుతూ వస్తు న్న సీనియర్ బ్యాట్స్‌మన్ ది ల్షాన్ ధమాకా ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ దిల్షాన్ (56 బంతుల్లో 83నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో చెలరేగా డు. ట్రేడ్‌మార్క్ దిల్‌స్కూప్ షాట్లతో అలరించిన దిల్షాన్ తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో విజృంభించాడు. ఒకవైపు సహచర బ్యాట్స్‌మెన్ ఔటై పెవిలియన్‌కు చేరుతున్నా పట్టువదలకుండా క్రీజును అంటిపెట్టుకుని దిల్షాన్ చూడచక్కని షాట్లతో ఆకట్టుకున్నాడు. ఓ దశ లో ఆఫ్ఘన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడం తో మ్యాచ్ రసపట్టులో పడింది. అయితే ఆఖర్లో కెప్టెన్ మాథ్యూస్(10 బంతుల్లో 21 నాటౌట్) అండతో జ ట్టును గెలిపించిన దిల్షాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. కడదాకా అద్భుత పోరాట పటిమ కనబర్చిన ఆఫ్ఘన్ బౌలర్లలో నబీ, రషీద్ ఒక్కో వికెట్ తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dilshan  Srilanka  T20 world cup  India  Afghanistan  Tillakaratne Dilshan  

Other Articles