Roja will attend AP Assembly from Tommarrow

Roja will attend ap assembly from tommarrow

Roja, RK Roja, YSRCP, Anitha, high court, AP, Assembly

After High court order Roja said that she will attend AP Assembly from tommarrow. TDP MLA Anitha fires on YSRCP MLA Roja

రేపటి నుండి అసెంబ్లీకి రోజా

Posted: 03/17/2016 04:53 PM IST
Roja will attend ap assembly from tommarrow

ఏపీ అసెంబ్లీ నుంచి యేడాదిపాటు సస్పెన్షన్‌కు గురైన వైసీపీ ఎమ్మెల్యే రోజా రేపటి నుంచి తాను అసెంబ్లీకి హాజరుకానున్నట్టు తెలిపారు. రేపు ఉదయం అసెంబ్లీకి హాజరవుతానని పేర్కొన్నారు. రోజాపై ఏపీ స్పీకర్ విధించిన యేడాది కాలం నిషేధాన్ని ఇవాళ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈమేరకు ఇవాళ ఆమె అసెంబ్లీ కార్యదర్శిని కలిసి కోర్టు ఉత్తర్వు కాపీని అందజేశారు. ఇవాళ తనకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. కోర్టు తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసిందని పేర్కొన్నారు. రేపటి అసెంబ్లీ సమావేశంలో జీరో అవర్‌లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని అన్నారు.

కోర్టు తీర్పును ఎవరైనా వక్రీకరించి మాట్లాడితే వారి సంగతి కోర్టే చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం మళ్లీ కోర్టుకు వెళితే తాను కూడా న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కాగా, టీడీపీ ఎమ్మెల్యే అనితను అసెంబ్లీలో అసభ్య పదజాలంతో దూషించారనే ఆరోపణలపై రోజాను యేడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానం మేరకు స్పీకర్ కొడెల శివప్రసాద్ ఆమెపై సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే.

వైసీపీ ఎమ్మెల్యే రోజా కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనిత ఆరోపించారు. కోర్టును తప్పుదోవ పట్టించి అసెంబ్లీలోకి రావాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఆమె ప్రయత్నాలను తిప్పికొడతామని అనిత పేర్కొన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీని ఆజ్ఞాపించే హక్కు కోర్టుకు లేదన్నారు. కోర్టు తీర్పుపై న్యాయపోరాటం చేస్తామన్నారు. తనను రోజా అసభ్యంగా దూషించిన విషయంపై జగన్ అన్నకు ఫిర్యాదు చేశానని ఒక మహిళగా తనకు న్యాయం చేయాలని కోరినా ఆయన నుంచి ఇప్పటి వరకు స్పందనలేదని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  RK Roja  YSRCP  Anitha  high court  Assembly  

Other Articles