rajendranath satirical poetry on government poll promises

Rajendranath reddy makes assembly feel free with his speech

ap assembly, budget sessions, ysrcp mla, buggana rajendranath reddy, nanda raja fortune story, rajendranath reddy jokes, rajendranath satirical poetry, discussion on budget, mosquito story,

In a matter of seconds, two major accidents took place at the same spot in Karimnagar city. Both the victims were women and fortunately, both are out of danger.

ITEMVIDEOS: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నవ్వులు పూయించిన రాజేంద్రుడు

Posted: 03/17/2016 08:51 PM IST
Rajendranath reddy makes assembly feel free with his speech

నిత్యం నువ్వా నేనా అంటూ అధికార విపక్షాల ప్రసంగాలతో పలు అంశాలపై. ప్రజా సమస్యలపై దద్దరిల్లే అసెంబ్లీలో రాజేంద్రుడు నవ్వులు పూయించారు. తనదైన శైలిలో ప్రభుత్వ ఎన్నికల హామీలపై ఆయన సెటైర్లు వేశారు. అదేంటి అనుకుంటున్నారా..? ఈ రాజేంద్రుడు ఎవరో కాదు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి. బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ పై ప్రసంగించిన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో నవ్వులు పూయించారు. సీరియస్ అంశాలపై కూడా ఆయన వ్యంగోక్తంగా విసిరిన సైటర్లు సభ్యులను నవ్వించాయి. తమపైనే జోకులు వేసినా.. టీడీపీ సభ్యులు కూడా నవ్వులను అపుకోలేకపోయారు.

ముందుగా 'నందోరాజా భవిష్యతి' కథను గుర్తుచేశారు. రైతు రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయంటే నందోరాజా భవిష్యతి, డ్వాక్రా రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయంటే నందోరాజా భవిష్యతి.. ఇలా ప్రతి అంశానికీ అదే మంత్రం పఠిస్తున్నారన్నారు. అది ఏంటంటే, రాజు గారికి ఇద్దరు భార్యలున్నారని, చిన్నభార్య కొడుకు నందుడని అన్నారు. చిన్న భార్యకు ఊళ్లో అన్నిచోట్లా అప్పులేనని, వాటిని ఎప్పుడు తీరుస్తారంటే.. ఏదో ఒక రోజు నందుడు రాజు కాకపోతాడా, అప్పులన్నీ తీర్చకపోతానా అన్నారన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఏదో ఒకరోజు చినబాబు రాకపోతాడా.. రుణమాఫీ చేయకపోతామా, చినబాబు రాకపోతాడా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోతామా అన్నట్లు పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.

అలాగే, చివర్లో ఒక దోమ కథ కూడా వినిపించారు. పిల్ల దోమ పుట్టిన తర్వాత తొలిసారి ప్రపంచంలోకి వెళ్లి ఒక రోజంతా తిరిగి వచ్చిందని.. వచ్చిన తర్వాత దాని తల్లి దోమ, తండ్రి దోమ కలిసి ప్రపంచం ఎలా ఉందని అడిగారని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. దానికి పిల్ల దోమ.. ''నాకింత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని మీరు ఇంతవరకు చెప్పనే లేదు, నేను బయటకు వెళ్లగానే అందరూ చప్పట్లు కొడుతున్నారు'' అందని, మన ప్రభుత్వం తీరు కూడా అలాగే ఉందని అన్నారు. దీంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిశాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap assembly  budget sessions  ysrcp mla  buggana rajendranath reddy  

Other Articles