BJP leader announces Rs 1 crore reward for cutting traitor Owaisi's tongue

Bjp leader calls owaisi traitor announces rs 1 crore reward for cutting his tongue

Bharat Mata ki jai, Asaduddin Owaisi, Hindu Sena, Shyam Prakash Dwivedi, BJP, Dushyant Tomar, Student leader, reward, AIMIM, ABVP, Meerut

Hindu Sena activists has put up posters branding Majlis-e-Ittehadul Muslimeen president Asaduddin Owaisi a “traitor” at the entrance of his official Ashoka Road residence in New Delh

ఓవైసీ నాలుకకు ధర పెరిగింది.. కోటీ ఇనాం ప్రకటించిన బీజేపి నేత..

Posted: 03/17/2016 03:03 PM IST
Bjp leader calls owaisi traitor announces rs 1 crore reward for cutting his tongue

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నాలుకకు ధర పెరుగుతోంది. భారత్ మాతాకీ జై అనేందుకు నిరాకరించి తన మెడపై కత్తిపెట్టినా అలాంటి నినాదం ఇవ్వనని.. అలా నినాదం చేయాలని ఏ  రాజ్యాంగంలోనూ లేదని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. వివాదం రేగడంతో ఎట్టకేలకు జైహింద్ అని వ్యాఖ్యానించినా.. అయనపై విమర్శ పర్వం మాత్రం అగడం లేదు. రోజురోజుకూ ఈ వ్యాఖ్యలు  రేపిన దూమారం చెలరోగుతోంది. అసుదుద్దీన్ ఓవైసీ నాలుక కట్ చేసిన వారికి 21 వేల పారితోషికం ఇస్తామన్న ప్రకటించిన మీరట్ ఏబీవీపీ నేతకు.. మరో బీజీపీ నేత తోడయ్యారు.

భారతమాతకు జై అని పలకడానికి నిరాకరించిన అసద్ నాలుకను ఎవరైనా కట్ చేస్తే వారికి కోటి రూపాయల ఇనాం ఇస్తానని ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత శ్యామ ప్రకాష్ ద్వివేది ప్రకటించారు. భారతమాతకు జై అని నినదం చేయడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన అసద్ ఒక దేశద్రోహి అని అభిప్రాయపడ్డారు. ఆయనకు ఈ దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. భారతమాతను అవమానించిన ఒవైసీ నాలుకను తెగ్గొయ్యాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పని చేసినవారికి  ఏకంగా కోటి రూపాయల రివార్డ్ ఇస్తానంటూ వ్యాఖ్యానించి మరో సంచలనం సృష్టించారు.

కొత్త తరానికి భారతమాతను కీర్తిస్తూ నినాదాలు చేయడం నేర్పాలన్న ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భాగవత్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో మహారాష్ట్ర లాతూర్ లో జరిగిన సభలో ప్రసంగించిన అసదుద్దీన్ ఓవైసీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా అసద్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూడా తమ పార్టీ అధినేత తరహాలోనే వ్యవహరించడంతో పాటు 'భారత్ మాతాకీ జై' అనేందుకు నిరాకరించిన మజ్లిస్ ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharat Mata ki jai  Asaduddin Owaisi  Hindu Sena  Shyam Prakash Dwivedi  BJP  

Other Articles