In Medak dist villagers did Funeral to a Dog

In medak dist villagers did funeral to a dog

DOg, Dog Funeral, Medak, Dog Funeral in Medak

In Medak district Vingsanpalli village, villagers did funeral to a faithfull dog. As per traditions they did funeral with tears in eyes.

కుక్కకు ఘనంగా అంత్యక్రియలు

Posted: 03/17/2016 03:44 PM IST
In medak dist villagers did funeral to a dog

కుక్క అంటేనే నమ్మకానికి చిరునామా అని అందరికి తెలుసు. ప్రపంచంలో ఉన్న అన్ని జంతువుల కన్నా మనుషులకు ఎంతో నమ్మకమైనవి కుక్కలు మాత్రమే. నమ్మకానికి అంబాసిడర్ లాంటివి కుక్కలు.. ఒక్క మాటలో చెప్పాలంటే నమ్మకానికి అమ్మవంటిది. అయితే తాజాగా తెలంగాణలోని ఒక చోట చనిపోయిన కుక్కకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. సాంప్రదాయబద్దంగా అంత్యక్రియలను నిర్వహించడమే కాకుండా.. ఆ గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంతకీ ఆ కుక్కకు అంతగా ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారో తెలుసా?

మెదక్ జిల్లా కేంద్రం పరిధిలోని లింగ్సాన్ పల్లి గ్రామానికి చెందిన ఈ గ్రామ సింహం(కుక్క) గుర్తు తెలియని వ్యక్తి పెట్టిన విషాహారం తిని చనిసపోయింది. అంతకు ముందు ఈ కుక్క మీద గ్రామస్తులకు ఎంతో నమ్మకం. ఈ కుక్క ఉన్నన్ని రోజులు గ్రామంలోకి ఒక్క కోతిని కూడా రానివ్వలేదు. దాంతో ఈ కుక్క అంటే అందరికి అభిమానం. ఎవరి ఇంటికి వెళ్లినా ఆ కుక్కకు ఆహారం పెట్టేవాళ్లు. అయితే ఈ కుక్క చనిపోవడంతో గ్రామస్తులు అందరూ కలిసి ఎంతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DOg  Dog Funeral  Medak  Dog Funeral in Medak  

Other Articles