Roja benifitated by the Yanamala Ramakrishnudu

Roja benifitated by the yanamala ramakrishnudu

Roja, YSRCP, Yanamala Ramakrishnudu, AP, Assembly

Roja benifitated by the Yanamala Ramakrishnudu. In the high court Roja gain the ramakrishnudu statements while the suspension proposal of Roja.

యనమల చేసిన తప్పే రోజాకు కలిసివచ్చింది

Posted: 03/17/2016 01:36 PM IST
Roja benifitated by the yanamala ramakrishnudu

వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్.కె రోజాపై ఏపి అసెంబ్లీ విధించిన ఏడాది సస్పెన్షన్ ను డిస్మిస్ చూస్తు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ముందుగా హైకోర్టుకు వెళ్లిన రోజా.. అక్కడ దీని మీద విచారణకు రిజిస్ట్రార్ అనుమతించకపోవడంతో సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. అయితే మొత్తానికి సుప్రీంకోర్టు మొట్టికాయలతో హైకోర్టు విచారణకు స్వీకరించడం.. రోజాకు అనుకూలంగా తీర్పు వెలువడటం జరిగిపోయాయి. అయితే ఇక్కడ రోజాకు అనుకూలంగా ఉన్న అంశాలు చూస్తే అందరూ షాకవుతారు. ఎందుకంటే రోజాను సస్పెండ్ చేయాలని ప్రపోజ్ చేసిన యనమల రామకృష్ణుడు చేసిన ప్రపోజల్ లో తప్పుదే రోజాకు ఊరటనిచ్చిందట.

అసెంబ్లీ రూల్స్ లోని సెక్షన్ 340 ప్రకారం రోజాపై స్పీకర్ ఏడాది పాటు సస్పెన్షన్ వేశారు. అయితే ఆ సెక్షన్ కింద కేవలం ఒక సెషన్ కు మాత్రమే సస్పెన్షన్  పరిమితం. అయితే సదరు విషయాన్ని అంతగా పట్టించుకోని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సెక్షన్ 340 కిందనే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలనే  తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీనిపై స్పీకర్ కూడా ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తొలుత హైకోర్టును ఆశ్రయించిన రోజా, అక్కడ వాదోపవాదాలు పూర్తి కాకుండానే సుప్రీంకోర్టుకు వెళ్లారు . సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టు వేగంగా స్పందించింది. నిన్న రోజా, ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనల సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 340 ప్రకారం సస్పెండ్ చేసి... ఆ తర్వాత సెక్షన్ ను మారుస్తామంటే, ఎలా కుదురుతుందని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. అంతేకాక ప్రభుత్వ న్యాయవాది వాదనను న్యాయమూర్తి పెద్దగా పట్టించుకోకుండానే వాదనలు ముగిసినట్లు ప్రకటించారు. రోజాపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  YSRCP  Yanamala Ramakrishnudu  AP  Assembly  

Other Articles