Roja said that She is coming

Roja said that she is coming

Roja, Supreme court, AP, High court, Assembly, YSRCP

After High court orders Roja spoke with media. She said Justice did for Her. She also said protest for the peoples better life will be contiues.

ITEMVIDEOS: వస్తున్నానంటున్న రోజా

Posted: 03/17/2016 12:56 PM IST
Roja said that she is coming

హైకోర్టు లో వైసీపీ ఎమ్మెల్యే రోజకు ఊరట లభించింది. అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కొట్టేసిన హైకోర్టు, తదుపరి వాదనలు వినడానికి నాలుగు వారాల పాటు విచారణ వాయిదా వేసింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది హైకోర్టు... దీంతో ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నట్టు రోజా స్పష్టం చేశారు. తన పోరాటంలో న్యాయం ఉందని తేలింది అదే ఆత్మవిశ్వాసాన్ని నింపిందని రోజా వ్యాఖ్యానించారు. ఇక హైకోర్టు తీర్పుతో ఏపీ ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. నాలుగు వారాల తర్వాత వాదనలకు హైకోర్టు సమయం ఇవ్వడంతో తదుపరి వ్యూహంపై కసరత్తు చేస్తోంది. సస్పెన్షన్ తీర్మానాన్ని కోర్టు సస్పెండ్ చేయడంతో రోజా ప్రస్తుతం జరగుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరవడం ఖాయం.

వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుకుగాను టీడీపీ నేతలు న్యాయనిపుణులను సంప్రదించే యోచనలో ఉన్నారు. ఇందుకుగాను సీఎం చంద్రబాబు, స్పీకర్‌ కోడెలతో విడివిడిగా యనమల భేటీ అయ్యారు. అసెంబ్లీ నుంచి రోజా సస్పెన్షన్‌- హైకోర్టు తీర్పుపై చర్చించారు. రోజాపై సస్పెన్షన్‌పై న్యాయ నిపుణులను సంప్రదించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లనున్నారు.

రోజా సస్పెన్షన్‌పై మూడు అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేదు..ప్రివిలేజ్‌ కమిటీలో రోజాపై పెండింగ్‌లో ఉన్న కేసులను చర్చించి మరోసారి వేటు వేసే దిశగా ముందుకెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  Supreme court  AP  High court  Assembly  YSRCP  

Other Articles