Barack Obama believes Americans won't elect Donald Trump

Barack obama believes americans won t elect donald trump

America, Donald Trump, Obama

President Barack Obama believes Americans would not elect Donald Trump as his successor as they know that there are "global consequences" of the remarks coming from presidential candidates, the White House said on Tuesday.

ట్రంప్ గెలవకపోవచ్చేమో: ఒబామా

Posted: 03/15/2016 07:43 PM IST
Barack obama believes americans won t elect donald trump

అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. ముస్లింలు అమెరికాకు రావడం వీలులేదని, ముస్లింలు అమెరికా అంటే అసహ్యించుకుంటున్నారని ఇలా తీవ్రంగా వ్యాఖ్యానించారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను ప్రజలు విశ్వసించరని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఈ విషయమై ఒబామా మాట్లాడుతూ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతాయన్నారు.

నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు ఆచితూచి గమనిస్తున్నారని ఒబామా అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు ఉండకపోవచ్చని ఒబామా అభిప్రాయపడినట్టు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం హిల్లరీ కంటే చాలా స్థానాల్లో డొనాల్డ్ ట్రంప్ ముందున్నారు. దాంతో డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడా లేదా అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  Donald Trump  Obama  

Other Articles