No Confidence motion on AP Assembly

No confidence motion on ap assembly

YSRCP, Speaker, AP, Assembly, Chandrababu Naidu, No Confidence Motion

YSRCP gave notice to Speaker Kodela Shivaprasad. They noticed that Speaker did not maintaining equal priority to all parties.

స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం

Posted: 03/15/2016 10:45 AM IST
No confidence motion on ap assembly

ఏపి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికారపక్షం,. ప్రతిపక్షాల మధ్య భారీగా మాటల యుధ్దం సాగుతోంది. ప్రతిపక్షాలు మీ ప్రభుత్వం అవినీతి మకిలీ అంటించుకుంది అంటే.. అధికారపక్షం ఉవ్వెత్తున ప్రతిపక్ష నాయకుల మీద మండిపడుతోంది. కాగా మొన్న ప్రభుత్వం మీద అవి:శ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా స్పీకర్ పై అవిశ్వాస తీర్మానినికి నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీలో స్పీకర్ తీరు కేవలం అధికారపక్షానికి మద్దతునిచ్చేట్లు ఉందని ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు.

ఏపీ అసెంబ్లీ  ఎప్పుడు జ‌రిగినా స్పీక‌ర్ కోడెల అధికార ప‌క్షానికి కొమ్ము కాస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్సీ ఆరోపిస్తోంది. ఇవాళ కూడా స‌భ‌లో అదే జ‌రిగింద‌ని చెబుతోంది….జ్యుడీషియ‌ల్ వ్యవ‌స్థపై కామెంట్లు చేసినందుకు జ‌గ‌న్ క్షమాప‌ణ చెప్పాల‌ని, జ‌డ్జీల‌ను అన్నందుకు సారీ చెప్పాల‌ని సీఎం చంద్రబాబుతో స‌హా టీడీపీ నేత‌లంతా ప‌ట్టుప‌ట్టారు. దీనికి స్పీక‌ర్ కూడా స్పందించి క్షమాప‌ణ చెప్పాల‌ని జ‌గ‌న్‌ని కోరారు…దీంతో జ‌గ‌న్‌కి స్పీక‌ర్‌కి మ‌ధ్య వాగ్యుద్ధం జ‌రిగింది. ఏపీ శాస‌న‌స‌భ ఏ సెష‌న్‌లో అయిన స‌భ జ‌రిగిన ప్రతి రోజు ప్రతిసారి జ‌గ‌న్‌కి స్పీక‌ర్‌కి మ‌ధ్య ల‌డాయి న‌డుస్తోంది. జ‌గ‌న్ మాట్లాడుతుండ‌గా మైక్ క‌ట్ చేసి అధికార స‌భ్యులు ఎదురుదాడి చేసేలా స్పీక‌ర్ ప్రోత్సహిస్తున్నార‌ని వైఎస్సార్సీ ఆరోపిస్తోంది. సినిమాలో హీరో విల‌న్ ఫైటింగ్ చేసుకున్నట్టుగా స్పీక‌ర్‌, ఏకైక ప్రధాన ప్రతిప‌క్ష నేత వాగ్యుద్ధం చేసుకుంటున్నారు. గ‌తంలో ఏ స‌భ‌లోనూ ఇలా జ‌ర‌గ‌లేదు. దీంతో స్పీక‌ర్ ఏక‌ప‌క్షంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని వైఎస్సార్సీ ఆరోపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  Speaker  AP  Assembly  Chandrababu Naidu  No Confidence Motion  

Other Articles