BJP MLA attacks police horse with lathi, breaks its leg

Bjp mla attacks police horse with lathi breaks its leg

MLA, Horse, Police, Dehradun, Ganesg Joshi

Bharatiya Janata Party legislator Ganesh Joshi on Monday attacked a police horse with a lathi, leaving the beast with a broken leg. The assault took place during a BJP protest in Dehradun against the Harish Rawat government in Uttarakhand. More than 3,000 police personnel were deployed to control a crowd that tried to force its way towards the state legislature building.

గుర్రాన్ని చితకబాదిన ఎమ్మెల్యే

Posted: 03/15/2016 07:22 AM IST
Bjp mla attacks police horse with lathi breaks its leg

మూగ జీవాలను ప్రేమతో చూసుకోవాలి.. అవి కూడా సాటి జీవాలు అని గుర్తించాలి అన్న విచక్షణను కోల్పోయాడు ఓ ఎమ్మెల్యేగారు. మూగజీవాలు అంటే ప్రేమలేకపోవడం కాదు... ఏకంగా తన కోపాన్ని ఓ మూగజీవి మీద చూపించారు. కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే తన ప్రతాపాన్ని మూగజీవి మీద చూపించాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తుండగా.. వారిని చెదరగొట్టడానికి పోలీసులు గుర్రాల మీద వచ్చారు. పోలీసులు తమ ఆందోళన అడ్డుకోవడంతో సహనం కోల్పోయిన ఆ ఎమ్మెల్యే పోలీసు గుర్రంపై కక్ష తీర్చుకున్నాడు. మూగజీవమన్న కనికరం లేకుండా లాఠీతో గుర్రాన్ని చితకబాదాడు. ఈ ఘటన సోమవారం డెహ్రాడూన్‌లో జరిగింది. హరీశ్ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డెహ్రాడూన్‌లో బీజేపీ భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.

ఈ నిరసనలో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి ఓ గుర్రంపై తన ప్రతాపం చూపాడు. లాఠీతో నిర్దాక్షిణంగా మూగజీవాన్ని బాదాడు. తీవ్రంగా గాయపడి దీనంగా అరుస్తున్న ఆ గుర్రాన్ని స్థానిక మిలటరీ అకాడమీలోని పశువైద్యశాలకు తరలించారు. చికిత్సలో భాగంగా తీవ్రగాయమైన గుర్రంకాలిని తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. గుర్రాన్ని తీవ్రంగా గాయపర్చిన ఎమ్మెల్యే గణేష్ జోషిపై కేసు పెడతామని పోలీసులు తెలిపారు. కాగా దీని మీద పెటా కూడా అందోళన వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA  Horse  Police  Dehradun  Ganesg Joshi  

Other Articles