Folk Singer Madhupriya's Three Month Old Marriage on the Rocks

Singer madhupriya files harassment case against husband

srikanth, attack, madhupriya, srikanth, humayun nagar, home, folk singer madhupriya, hyderabad, madhupriya husband srikanth, harrassement on women, domestic violence on women, dowry harrassement, police complaint

Noted folk singer Madhupriya's husband Srikanth attacked them at their residence in Uppal late on Saturday, her parents stated in a police complaint.

మనసు మార్చుకున్న మధుప్రియ.. భర్తతో కలసివేళ్లేందుకు సుముఖం..

Posted: 03/13/2016 03:34 PM IST
Singer madhupriya files harassment case against husband

తన భర్త వేధిస్తున్నాడని, అతని నుంచి ప్రాణహాని ఉందని నిన్న హుమాయూన్ నగర పోలీసులను ఆశ్రయించిన గాయని మధుప్రియ, ఈ ఉదయం తన ఆలోచనా ధోరణిని కాస్తంత మార్చుకున్నట్టు కనిపించింది. తన అత్తా, ఐదుగురు ఆడపడుచులు మంచివాళ్లేనని వ్యాఖ్యానించిన మధుప్రియ, తన భర్త శ్రీకాంత్ తిరిగి వచ్చి క్షమాపణలు కోరితే తిరిగి వెళ్లేందుకు సిద్ధమని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. నువ్వు ఆడపిల్లవమ్మా... కాస్తంత ఓపిక పట్టాలి అని అత్త చెప్పింది.

అమె సూచన మేరకు తానూ ఓపిక పట్టాననింది. మీకు తెలుసుగా ఆడపిల్లకు భూదేవంత ఓపికుంటుందని. కానీ ఆడపిల్ల ఓపిక నశిస్తే, ఓ శక్తిగా మారుతుందని కూడా అమె చెప్పిందని పేర్కోంది. ఇప్పుడు తన పరిస్థితీ కూడా అలానే మారిందని.. ఆరు నెలల వ్యవధిలో 60 ఏళ్ల అనుభవం వచ్చింది" అని మధుప్రియ తెలిపింది. శ్రీకాంత్ అంటే ఎంతో ప్రేముందని, తన వైఖరిని మార్చుకున్నాడన్న నమ్మకం కలిగితే కాపురానికి వెళ్తానని స్పష్టం చేసింది.    

కాగా అంతకుముందు తన భర్త శ్రీకాంత్ ను ఎంతో ఇష్టపడి వివాహం చేసుకోగా, దానంతా గంగలో పోసేసాడని, ఆ ప్రేమ గత రాత్రితో పోయిందని అమె అనింది. తనను బాగా కొట్టాడని ఆరోపించారు. తన భర్త వల్ల గృహహింసలను అనుభవించానని పేర్కోంది. అమ్మానాన్నల మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకున్న తాను తిరిగి వారి మాటలను విని భర్తపై ఆరోపణలు ఎందుకు చేస్తానని ప్రశ్నించిన మధుప్రియ, అతను దుర్మార్గుడని తెలుసుకున్న తరువాతే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఇప్పటికీ బయటకు రాకుండా ఉంటే, తన శవం కనిపించి వుండేదని అన్నారు. కడుపులో తన్నాడని, ఆ తరువాతే ఇక శ్రీకాంత్ దగ్గర ఉండకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తనను చేసుకున్నాకే దరిద్రం పట్టుకుందని తిడుతూ వేధించే వాడని, చంపేందుకు కూడా చూశాడని ఆరోపించారు. కాగా, మధుప్రియ ఆరోపణలు అవాస్తవమని శ్రీకాంత్ వాదించాడు.    

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srikanth  attack  madhupriya  srikanth  humayun nagar  

Other Articles