Man shocked as 'dead' wife turns up on TV programme two years after her burial

Husband shocked as dead wife turns up on tv

Husband shocked as 'dead' wife turns up on TV, dead wife, dead wife on popular TV programme, wife killed in road accident, Abragh Mohamed, Casablanca hospital, popular Moroccan television series,

A grieving husband who believed he had buried his wife after she was killed in a road accident was shocked when she popped up on a popular TV programme

టీవీ కార్యక్రమంలో చనిపోయిన భార్యను చూసి భర్త షాక్..!

Posted: 03/13/2016 03:37 PM IST
Husband shocked as dead wife turns up on tv

కారు ప్రమాదంలో చనిపోయిన భార్య హఠాత్తుగా టీవీలో కనిపించి భర్తకి షాక్ ఇచ్చింది.  భర్త ఆచూకీ కోసం వెతుకుతూ ఓ టీవీ షోలో దర్శనమివ్వడం అతనికి ఆనందాన్ని పంచింది.  మొరాకో దేశంలోని  అజిలాల్ ప్రాంతంలో నివసించే అబ్రగ్ మొహమ్మద్ కి ఈ వింత అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే..  రెండేళ్ల క్రితం అంటే 2014 లో  భార్య రోడ్డు ప్రమాదానికి గురైందనీ, బతికే అవకాశాలు తక్కువంటూ మొహమ్మద్ కి  సమాచారం అందింది.

ఆందోళనతో ఆసుపత్రి వెళ్లిన అతనికి  తీవ్ర గాయాలతో చనిపోయిందంటూ భార్య  మృతదేహాన్ని  అప్పగించారు వైద్యులు. యాక్సిడెంట్ లో గుర్తు పట్టలేనంతగా దెబ్బలు తగలడంతో ఆ మృతదేహాన్ని తన భార్యదిగానే భావించి అంత్యక్రియలు నిర్వహించాడు. దీంతో పాటుగా ఆసుపత్రి బిల్లు కూడా చెల్లించాడు. అలా  రెండేళ్లు గడిచిపోయాయి. ఇంతలో అకస్మాత్తుగా  స్థానిక  టీవీ  కార్యక్రమంలో భార్య ప్రత్యక్షమైంది. తప్పిపోయిన వ్యక్తుల గురించి చెప్పి.. వారిని తమ తమ బంధువుల చెంతకు చేర్చే కార్యక్రమం అది.

దీంతో ఆమె  సదరు టీవీ వాళ్లని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. రెండేళ్ల నుంచి భర్త మహమ్మద్  ఆచూకీ దొరకడం లేదని... సాయం చేయాలని కోరింది. దీంతో ఈ  స్టోరీని వారు  టెలీకాస్ట్  చేశారు.  ఈ షో చూసిన మొహమ్మద్ స్నేహితులు  ఆ విషయాన్నిఅతడి  చెవిన వేశారు.  దీంతో ఆశ్చర్య పోవడం అతని వంతైంది. ఇపుడు వీరిద్దరి స్టోరీ  మొరాకో సోషల్ మీడియాలో పెద్ద సంచలన వార్తగా మారింది. విభిన్న చర్చలకు దారితీసింది. అయితే వారిద్దరూ కలిశారా? లేదా? అనే విషయంలో  మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : husband  Abragh Mohamed  wife  'died' wife  TV show  

Other Articles