si held for kidnaping girl student in repalle

Case against si for abuducting student

Student, kidnap, SI, strategy, si held for abuducting girl student, si judge on family, case against si, sub inspector booked for kidnap, sri chaitanya techmo school, repalle kidnap case

Ongole sub inspector jagan mohan absconding after police booked case against him in girl student kidanping case

ఈ పోలీసోడు రక్షణకు తక్కువ.. కిడ్నాపర్ కు ఎక్కువ

Posted: 03/12/2016 11:43 AM IST
Case against si for abuducting student

సామాన్యులకు రక్షణ కల్పించాల్సిన పోలీసు ఉద్యోగం అందులోనూ సబ్ ఇన్స్ పక్టర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఓ ప్రబుద్దుడు తన బుద్దిని మాత్రం వక్రమార్గంలో నడిపించి చివరకు ఆ ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నాడు. పోలీసు ఉద్యోగానికి తక్కువ, కిడ్నాపర్ కు ఎక్కువగా అతని చర్యలున్నాయి. ఓ పర  స్త్రీపై మనస్సుపడి ఆమె కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన సంఘటన పట్టణంలో కలకలం సృష్టించింది. పట్టణ సీఐ వీ మల్లిఖార్జునరావు కథనం ప్రకారం బేతపూడి గ్రామానికి చెందిన జగన్మోహనరావు ఒంగోలు పోలీసు ట్రైనింగ్ సెంటరు(పీటీసీ)లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు.

మల్లిఖార్జునరావుకు మండలంలోని బేతపూడి గ్రామానికి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులతో విభేదాలున్నాయి. ఈ క్రమంలో పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని పరిచయస్తురాలు ఒంగోలు లాయరుపేటకు చెందిన బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు ఈదుపల్లి సుధారాణి సాయంతో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. వారిద్దరూ శుక్రవారం పాఠశాల వద్దకు వచ్చి విద్యార్థినిని పిలిపించి కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా విద్యార్థిని గట్టిగా కేకలు వేస్తూ స్కూల్లోకి పరుగెత్తింది.

దీంతో స్థానికులు, ఉపాధ్యాయులు వ చ్చేసరికి జగన్మోనహనరావు, సుధారాణిలు పరారయ్యరు. ఉపాధ్యాయులు విద్యార్థిని బంధువులకు, పోలీసులకు సమాచారమిచ్చి స్థానికుల సాయంతో పాఠశాల పరిసరాల్లో వెతుకుతుండగా సుధారాణి వారి కంటపడింది. ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో సుధారాణి వివరాలు వెల్లడించింది. ఎస్సై జగన్మోహనరావు పరారీలో ఉన్నాడు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles