Vijay Mallya says he didnt flee from India

Vijay mallya says he didnt flee from india

Vijay Malya, Court, Vijay malya tweets, Rajyasabha, London, Kingfisher

Liquor baron Vijay Mallya, who owes crores of rupees to more than a dozen banks and is wanted by the Enforecement Directorate for money laundering, today said that he is not an absconder and he did not flee India.

హాట్ టాపిక్ గా మారిన విజయ్ మాల్యా తాజా ట్వీట్లు

Posted: 03/11/2016 07:59 AM IST
Vijay mallya says he didnt flee from india

దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న బడా పారిశ్రామికంవేత్త విజయ్ మాల్యా తన ట్విట్టర్ ద్వారా సంచలన ట్వీట్ చేశారు. దాదాపు 9 వేల కోట్ల రూపాయలను ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టాడని బ్యాంకులు కోర్టుమెట్లెక్కాయి. కాగా నిన్నటి పార్లమెంట్ సమావేశాల్లో విజయ్ మాల్యా దేశం వదిలివెళ్లడానికి ప్రభుత్వ నిర్లక్షమే కారణం అంటూ విపక్షాలు మండిపడ్డాయి. మార్చి 2 తేదీననే విజయ్ మాల్యా దేశం వదిలివెళ్లినట్లు కోర్టుకు అటార్నీ జనలర్ వెల్లడించారు. కాగా ఏ దేశంలో ఉన్నా సరే విజయ్ మాల్యాకు నోటీసులు అందించాలని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. కాగా తాజాగా విజయ్ మాల్యా చేసిన ట్వీట్లు రాజకీయ వర్గాల్లు కలకలం రేపుతున్నాయి.

తాను ఎక్కడికీ పారిపోలేదని, చట్టానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు ఉదయం వరుస ట్వీట్లు చేశారు. అంతేకాదు తనపై బురద జల్లుతున్నారంటూ మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'నేనొకి అంతర్జాతీయ స్థాయి వ్యాపారవేత్తను. దేశదేశాలు తిరగటం నాకు కొత్తేంకాదు. అలాంటి నాపై ఇండియా నుంచి పారిపోయాడంటూ పుకార్లు సృష్టిస్తున్నారు. ఆ వార్తల్లో నిజం లేదు. బాధ్యతగల పార్లమెంట్ సభ్యుడిగా నేను చట్టాన్ని గౌరవిస్తాను. వ్యాపారానికి, బ్యాంకుల రుణాలకు సంబంధించిన వ్యవహారాల్ని చట్టపరంగానే ఎదుర్కొంటాను' అంటూ ట్విట్టర్ లో పేర్కొన్న విజయ్ మాల్యా ప్రస్తుతం తాను ఎక్కడున్నది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.

 

 

'ఆస్తులు ప్రకటించలేదని మీడియా గగ్గోలు పెడుతోంది. అయితే ఆ వివరాలేవీ తెలియకుండానే బ్యాంకులు నాకు రుణమిచ్చాయా?' అని మీడియాపై అక్కసు వెళ్లగక్కిన మాల్యా.. మీడియా అధినేతలు ఉద్దేశపూర్వకంగా తనను డీఫేమ్ చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా సంస్థల అధిపతులకు గతంలో ఎన్నో మేళ్లు చేశానని, అవన్నీ మర్చిపోయి కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసమే తనపై అభాండాలు మోపుతున్నారని మాల్యా ఆరోపించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Malya  Court  Vijay malya tweets  Rajyasabha  London  Kingfisher  

Other Articles