Salman Khan pleads innocence in Arms Act case

Salman khan pleads innocence in arms act case

salman Khan, Jodhpur, arms acrt case

Bollywood actor Salman Khan told a Jodhpur court on Thursday that he is innocent and was being falsely implicated in the 1998 Arms Act case.‘I am innocent and have been falsely implicated in this case,” Khan said, as he recorded his statement, in connection with the poaching of protected black bucks during film shooting, at Kankani village in October, 1998.

తనను అన్యాయంగా ఇరికించారన్న సల్మాన్ ఖాన్

Posted: 03/11/2016 07:33 AM IST
Salman khan pleads innocence in arms act case

తనను కావాలనే అక్రమ ఆయుధాల కేసులో ఇరికించారని బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఆరోపించాడు. 1998 నాటి కేసులో జోధ్‌పూర్‌ కోర్టులో హాజరైన సల్మాన్‌ ఖాన్.. న్యాయస్థానం ఎదుట తన వాంగ్మూలం ఇచ్చాడు. ఓ తప్పుడు వార్త ఆధారంగా అధికారులు తనపై కేసు నమోదు చేశారని సల్మాన్‌ ఆరోపించాడు. ఇటీవలే హిట్‌ అండ్‌ రన్‌ కేసు నుంచి విముక్తి పొందిన సల్మాన్‌.. 1998లో కృష్ణజింకలను వేటాడిన కేసులో లైసెన్స్‌ లేని ఆయుధాన్ని ఉపయోగించాడనే అభియోగంపై రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ కోర్టుకు హాజరయ్యాడు. కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌కుఇప్పటికే జైలు శిక్ష పడగా.. ప్రస్తుతం బెయిలు మీద బయటకు వచ్చాడు.

విచారణ కోసం సల్మాన్ జోధ్‌పూర్‌కు ప్రత్యేక విమానంలో వచ్చాడు. సల్మాన్‌ రాక సందర్భంగా కోర్టు పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. విచారణ సందర్భంగా సల్మాన్‌ పేరు, తండ్రి పేరు, అడ్రస్‌ గురించి మేజిస్ట్రేట్‌ ప్రశ్నించారు. కులం గురించి ప్రశ్నించగా.. తాను భారతీయుణ్నని, అదే తన కులమని సల్మాన్‌ మేజిస్ట్రేట్‌కు తెలిపాడు. విచారణ సందర్భంగా కేసులో ముగ్గురు సాక్షుల స్టేట్‌మెంట్‌ల గురించి మేజిస్ట్రేట్‌ సల్మాన్‌ను ప్రశ్నించారు. సల్మాన్‌ ఆదేశాల మేరకే ముంబై నుంచి ఆయుధాలు తెచ్చానని ఓ సాక్షి ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై సంతకాలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే సల్మాన్‌ ఆ
స్టేట్‌మెంట్‌ను తోసిపుచ్చారు. ఫారెస్ట్ అధికారుల వత్తిడి మేరకే ఆ స్టేట్‌మెంట్‌పై సంతకం చేశానని సల్మాన్‌ మేజిస్ట్రేట్‌కు తెలిపారు. తనను అన్యాయంగా కేసులో ఇరికించారన్న సల్మాన్‌.. పోలీసులు ఓ
తప్పుడు వార్త ఆధారంగా తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman Khan  Jodhpur  arms acrt case  

Other Articles