Naidu afraid of CBI Enquiry

Naidu afraid of cbi enquiry

Jagan, YSRCP, YS jagan, JaganMoharReddy, AP, Amaravati, Lands, Chadrababu Naidu, narayana, AP Assembly

JaganMohan Reddy attacked on Chadrababu Naidu in AP Assembly. He appeal to enquire Amaravati lands issue with CBI.

చంద్రబాబుకు చమటలు..?

Posted: 03/09/2016 04:34 PM IST
Naidu afraid of cbi enquiry

ఏపి రాజధాని అమరావతి. సీమాంధ్రుల కలల స్వర్గంగా భావిస్తున్న అపురూప నగరం. ఏపి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నికైన తర్వాత ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజధాని నగరం అమరావతి. అమరావతిని నిర్మించేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల నుండి దాదాపు యాభైనాలుగు వేల ఎకరాల భూమిని సేకరించింది. ముందు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకురాగా.. తర్వాత ల్యాండ్ పూలింగ్ ద్వారామిగిలిన భూములను కూడా రాజధాని కోసం సమీకరించారు. అయితే భూముల వ్యవహారంలో తాజాగా భారీ అవినీతి జరిగిందని సాక్షి మీడియా ఓ కథనాన్ని వరుసగా... ప్రచురించింది.

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఏపి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. తాజాగా ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఎంతో వాడీవేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి భూముల చుట్టూనే చర్చ సాగుతోంది. చంద్రబాబు నాయుడు అనుయాయులు కొంత మంది రాజధాని గ్రామాలలో, గ్రామాల పరిసర ప్రాంతాల్లో బారీగా భూములను పోగేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి నారాయణతో పలు కీలక నేతలు ఇందులో ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత వైయస్ జగన్ చంద్రబాబు నాయుడు మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రసంగించారు. ముందుగా రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి.. చెయ్యకుండా నమ్మక ద్రోహం చేసిన దానికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు వైయస్ జగన్ ప్రకటించారు. తర్వాత అమరావతి భూముల మీద ప్రశ్నలు లేవనెత్తారు జగన్. చంద్రబాబు నాయుడు ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని జగన్ తీవ్రంగా మండిపడ్డారు. అయితే జగన్ చేసిన విమర్శల మీద మంత్రులు స్పందించారు.

జగన్ చేస్తున్న ఆరోపణలకు సంబందించిన సాక్షాలు ఏవైనా ఉంటే తమకు సమర్పిస్తే దాని మీద చర్యలకు దిగుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే జగన్ మాత్రం మొత్తం వ్యవహారం మీద చంద్రబాబు నాయుడు సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. అయితే దీని మీద చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు విడ్డూరంగా ఉంది, జగన్ అమరావతి ప్రతిష్టను దిగజార్చాలనే కుట్రతోనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ ఎంక్వైరీ వేస్తే పరువుపోతుందని.. ఫలితంగా పెట్టుబడులు రావని వివరణ ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు ఎందుకు సీబీఐ ఎంక్వైరీకి భయపడుతున్నారు అన్నది పాయింట్. సీబీఐ ఎంక్వైరీనే కాదు అసలు ఏ ఎంక్వైరీ వెయ్యం అని ప్రకటించేశారు. చంద్రబాబు నాయుడు ఇలా ప్రకటించడం ద్వారా ఆత్మన్యూనతలోపడ్డట్లు కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో ఎన్నో సార్లు దాదాపు 38 పార్లు తన మీద విమర్శల పేరుతో వైయస్ రాజశేఖర్ రెడ్డి  ఎంక్వైరీ చేయిచినా కూడా తన మీద ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారని చంద్రబాబు నాయుడు చాలా సార్లు వ్యాఖ్యానించాడు.

మరి అప్పుడు అంత నిజాయితగా ఉన్నారు సరే.. ఇప్పుడు అమరావతి లాంటి రాష్ట్ర భవిష్యత్ నిర్దేశిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఎందుకు సీబీఐ ఎంక్వైరీకి ముందుకు రావడం లేదో అర్థంకావడం లేదు. ప్రజలను తప్పుదోవపట్టించడానికి వైయస్ జగన్ సీబీఐ ఎంక్వైరీ పేరును వాడుకుంటున్నారని మంత్రులు విమర్శించారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించి ఉంటే... ైీబీఐ ఎంక్వైరీ వేసినా కూడా కడిగిన ముత్యంగా బయటపడుతుంది.. ఫలితంగా చంద్రబాబు ప్రతిష్ట ఇంకా పెరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడుకు ఇంత మాత్రం తెలియదా..? అంటే ఎవరు మాత్రం నమ్ముతారు.

ఇక అమరావతిలో భూముల విషయంలో అవినీతి జరిగింది అని జగన్ కు చెందిన సాక్షి పత్రికలో కథనం వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు సాక్షి మీడియా మీద చిందులు తొక్కారు. ఈడీ కేసుల్లో ఉన్న సాక్షి పత్రిక తన మీద కథనాలు రాయడం ఏంటని ఫైర్ అయ్యారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఓ విషయాన్ని గమనించాలి... సాక్షి పత్రికకు నిజంగా అక్రమంగా నిధులు సమకూరి ఉంటే అది మూతపడుతుంది. కానీ అంతకన్నా ముందు మీడియా గా సాక్షికి ఉన్న బాధ్యత పరంగా పబ్లిష్ చేసిన కథనం మీద ప్రభుత్వంగా జవాబుదారీగా ఉండి తీరాల్సిందే. సాక్షి రాసినదాంట్లో ఎలాంటి నిజాలు లేవు అని... తన మంత్రులకు ఎలాంటి సంబందం లేదని చంద్రబాబు ఎందుకు నిరూపించలేకపోతున్నారో.? ఆయనకే తెలియాలి.

రాజకీయ చాణిక్యుడిగా ఎంతో పేరున్న చంద్రబాబు లాంటి నాయకుడు ఇప్పుడు అమరావతి భూముల వ్యవహారంలో మాత్రం ఖంగుతిన్నారు. మంత్రులు తమ చేతివాటాన్ిన ప్రదర్శించారని సాక్షిలో వచ్చిన కథనంతో షాక్ కు గురయ్యారు. గతంలో ఎన్నో ఎంక్వైరీలను ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు అమరావతి భూముల వ్యవహారం మీద సీబీఐ  ఎంక్వైరీ చెయ్యడానికి మాత్రం ముందుకు రావడం లేదు. చంద్రబాబు నాయుడు సీబీఐ ఎంక్వైరీ అంటే తేలుకుట్టిన దొంగలాగా మిన్నకుంటున్నారని చేస్తున్న జగన్ ఆరోపణల్లో నిజం లేకుండాపోతుందా అనే అనుమానాలకు చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. అన్నింటికి మించి చంద్రబాబు నాయుడు సీబీఐ ఎంక్వైరీ అంటే భయపడుతున్నారా.? అని చాలా మంది అనుమానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan  YSRCP  YS jagan  JaganMoharReddy  AP  Amaravati  Lands  Chadrababu Naidu  narayana  AP Assembly  

Other Articles