AP Assembly sessions in hot

Ap assembly sessions in hot

AP, CBI, Jagan, Chdrababu Naidu, YS Jagan, Amaravati, Amaravati Lands

AP opposition leader YS Jagan slam Chandrababu Naidu on Amaravthi L:ands. He said Chadrababu Naidu must enquire on Amaravathi Lands with CBI.

రాజధాని భూముల మీద దద్దరిల్లిన ఏపి అసెంబ్లీ

Posted: 03/09/2016 03:41 PM IST
Ap assembly sessions in hot

రాజధాని భూముల విషయంలో మళ్లీ ఎపి శాసనసభ దద్ధరిల్లింది. మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేలు బినామీ పేర్లతో కొన్నారన్న సాక్షి, జగన్ ల ఆరోపణలను రుజువు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ చేశారు. సాక్షి పత్రిక ప్రభుత్వ ఆస్తి అని, దానిని స్వాదీనం చేసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. రాజధాని భూములపై సిబిఐ విచారణ చేయాలని, ఇన్ సైడ్ ట్రేడింగ్ ను చంద్రబాబు ప్రోత్సహించారని జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడుతామని ముఖ్యమంత్రి చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారని అన్నారు. కాగా జగన్ ఆరోపణలు రుజువు చేయాలని, లేదా జగన్ పై చర్య తీసుకోవాలని చంద్రబాబు అన్నారు.

 రాజధానిలో జరిగిన భూఅక్రమాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కన్నా దారుణమైన నేరానికి పాల్పడ్డారని వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రాజధాని భూముల కొనుగోళ్ల విషయంలో చంద్రబాబే పెద్ద దోషి అని ఆయన స్పష్టం చేశారు. ఈ భూ అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధమా అని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రాజధాని అమరావతిలో భూ అక్రమాలపై బుధవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ఫలానా చోట రాజధాని వస్తుందని ముందే తన బినామీలకు చెప్పి చంద్రబాబు భూములు కొనుగోలు చేయించారని, ఇది ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ కన్నా దారుణమని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  CBI  Jagan  Chdrababu Naidu  YS Jagan  Amaravati  Amaravati Lands  

Other Articles