Indian hackers target 20 Bangladesh-based websites 'in revenge'

Dhoni troll revenge indian hackers hack 20 bangladesh based websites

Bangladesh,MS Dhoni,Taskin Ahmed,Hackers,India, asiacup 2016, dhoni trolled, indian hackers, kerala cyber warriors, bangladesh websites hacked,

Indian hackers have claimed to have hacked into more than 20 Bangladesh based websites in retaliation to a photoshopped image of Bangladesh bowler Taskin Ahmed carrying the severed head of MS Dhoni.

ప్రతీకార చర్య.. 20 బంగ్లాదేశ్ వెబ్ సైట్లను హ్యాక్ చేసిన ధోని అభిమానులు..

Posted: 03/08/2016 10:33 AM IST
Dhoni troll revenge indian hackers hack 20 bangladesh based websites

భారతీయులకు కోపం వచ్చింది. ముఖ్యంగా టీమిండియా లిమిటెడ్ ఓవర్ల కెప్టెన్, మిస్టర్ కూల్.. ఎంఎస్ ధోని అభిమానులకు భరించలేనంత అగ్రహంతో రగిలిపోయారు. అయితే ఉన్నపళంగా తమ అవేశాన్ని ప్రదర్శించలేదు. అసియా కప్ ఫైనల్స్ లో బంగ్లాదేశ్ ను, టీమిండియా ఓడించిన తరువాత.. అభిమానులు బంగ్లాపై ప్రతీకారేచ్ఛను తీర్చుకున్నారు. ధోని తలను బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్ తీసుకెళ్తున్నట్లుగా మార్ఫింగ్ చేసిన ఫొటో ఒకదాన్ని ప్రచారం చేయడంతో ప్రతీకారేచ్చతో రగిలిన ధోని అభిమానులు పలు బంగ్లాదేశీ వెబ్‌సైట్లను హ్యాక్ చేశారు.

మూడు ప్రభుత్వ సైట్లు సహా సుమారు 20 వరకు సైట్లను భారతీయులు హ్యాక్ చేసి, ఆ విషయాన్ని ఆ సైట్ల హోం పేజిలో తెలిపారు. కేరళ సైబర్ వారియర్స్‌కు చెందిన 15 మంది వైట్ హ్యాట్ హ్యాకర్ల బృందం ఈ సైబర్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ''బంగ్లాదేశ్ పౌరులకు మా సందేశం ఇదే. మీ క్రికెట్ జట్టు మా ముందు ఎందుకూ పనికిరాదు'' అన్న సందేశంతో పాటు ప్రతి సైట్‌లోనూ ధోనీ ఫొటోను కూడా పోస్ట్ చేశారు. 'ఆపరేషన్ ట్రాల్ బంగ్లాదేశ్' అని ఈ ఆపరేషన్‌కు పేరు పెట్టారు.

తామంతా భారతీయులైనందుకు గర్వపడుతున్నామని, దేశాన్ని అవమానించే ఎలాంటి చర్యలను సహించేది లేదని ఈ బృందానికి చెందిన ఓవ్యక్తి చెప్పారు. బంగ్లాదేశ్ ప్రజలు ధోనీ మార్ఫింగ్ ఫొటోతో అతడిని అవమానించారని, దానికి ధోనీ మైదానంలో సమాధానం చెబితే తాము సైబర్ స్పేస్‌లో సమాధానం చెబుతున్నామని అన్నారు. మరిన్ని వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం ఖాయమని, మరేదైనా సైట్‌లో ధోనీ మార్ఫింగ్ ఫొటో కనిపిస్తే అది హ్యాక్ అయి తీరుతుందని హెచ్చరించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles