Move beyond women development to women-led development

Move beyond women development to women led development

Modi, woman, Woman power, Pm Modi, Women development

Laying stress on moving towards women-led development, Prime Minister Narendra Modi on Sunday urged elected representatives to use technology to be more effective in their role and suggested creating a e-platform of women MPs. Addressing the National Conference of Women Legislators, he said the country must think beyond “women development” and move towards “women-led development” and asked woman lawmakers to interact with panchayat and municipal representatives in their area as a step towards their “empowerment”.

భారతీయ మహిళలు గ్రేట్

Posted: 03/07/2016 07:17 AM IST
Move beyond women development to women led development

ప్రధాని మోదీ భారతీయ మహిళలపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచంలోనే భారతీయ మహిళ అత్యుత్తమమని.. బహుళ కార్యనిర్వహణలో వారిని మించినవారు లేరని మోదీ కొనియాడారు. మహిళలు విభిన్న రంగాల్లో తమ శక్తిసామర్థ్యాలు నిరూపించుకొంటున్నారని.. ఇది దేశానికే గర్వకారణమని కొనియాడారు. మగవారితో పోల్చితే మహిళల సక్సెస్ శాతం అధికమని, అయితే మహిళలు తమను శక్తిమంతులను చేసుకోవాలని, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని సూచించారు. మహిళా నాయకత్వం మరింత శక్తిమంతమైతే.. దేశం తిరుగులేని విజయాలను సాధిస్తుందని పేర్కొన్నారు. చట్టాల రూపకల్పనలో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర అధికంగా ఉండాలని కోరుకున్నారు. గణాంకాలు, రుజువులతో చట్టసభ ల్లో మాట్లాడాలని సూచించారు.

సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మగవారికన్నా మహిళలే ముందుంటారని.. అది వారికి దేవుడు ఇచ్చిన సహజసిద్ధ వరమని పేర్కొన్నారు. చదువుకోని మహిళసైతం తమ వంటిం ట్లో ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగిస్తుందని ఈ సందర్భంగా ఉదహరించారు. సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు తమ రాజకీయ అనుభవానలు ఇతర రాష్ర్టాల ప్రతినిధులతో పంచుకోవాలి. తమ తమ ప్రాంతాల్లోని ఆయా సమస్యలపై చర్చించాలి. ఈ చర్చల్లో సులభమైన పరిష్కారాలు లభించే అవకాశం ఉంటుంది. ఎన్నో విషయాలు నేర్చుకొనేందుకు తోడ్పాటు లభిస్తుంది అని ప్రధాని మోదీ సూచించారు. మహిళా ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలు పంచుకోవడానికి ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ రూపొందిస్తామని ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  woman  Woman power  Pm Modi  Women development  

Other Articles