Ravela Susheel, his driver remanded to judicial custody under Nirbhaya Act

Molestation case andhra minister s son grilled sent to judicial custody

minister ravela kishore babu, ravela son molestation case, police, ravela son susheelakumar, minoriity woman, ravela susheel, ramesh, car driver, remand,attrocities on women, harrassment on women, rape on women, gangrape on women

Ravela Susheel and Manikonda Ramesh Rao the two accused are cooling their heels in the Chanchalguda Central Jail for trying to molest a teacher in Banjara Hills.

రావెల సుశీల్ సహా కారు డ్రైవర్ కు 14 రోజుల రిమాండ్

Posted: 03/07/2016 08:03 AM IST
Molestation case andhra minister s son grilled sent to judicial custody

మైనార్టీ యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించి, అమెను వెంబడించి, కుక్కపిట్ల కోసం వెళ్లానని వివరణ ఇచ్చిన ఏపీ మంత్రి రావెల కిశోర్ తనయుడు రావెల సుశీల్ కు న్యాయమూర్తి యువతిని వేధింపుల కేసులో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆయనతో పాటు ఆయన కారు డ్రైవర్ రమేష్‌కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో సుశీల్ ను అరెస్టు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు నిందితులను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.

కోర్టు సెలవు కావడంతో తుర్కయాంజాల్‌లో నివసించే మూడవ అదనపు మెట్రోపాలిటన్ జడ్జి తిరుపతిరావు ముందు హాజరుపరిచారు.  కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఈ ఇద్దరికీ 14 రోజులు రిమాండ్ విదిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిందితులను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా... రావెల సుశీల్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 8కి వాయిదా పడింది. పోలీసులు వీరిద్దరినీ కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా దానిపై మంగళవారం విచారణ నిర్వహిస్తానని చెప్పారు

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : minoriity woman  ravela susheel  ramesh  car driver  remand  crime news  

Other Articles