New Twist in Freedom 251 smart phones

New twist in freedom 251 smart phones

Freedom 251, Smart Phone, Ringing Bells

In a yet another blow to Noida-based startup Ringing Bells Pvt. Ltd. that last month launched with much fanfare the world's cheapest Rs. 251 (less that $4) smartphone, domestic feature phone brand Advantage Computers' (Adcom) on Friday announced it may consider legal action against Ringing Bells.

ఫ్రీడం 251 స్మార్ట్ ఫోన్ అసలు ధర 3600..?

Posted: 03/05/2016 09:02 AM IST
New twist in freedom 251 smart phones

దేశవ్యాప్తంగా హల్ చల్ చేసిన ఫ్రీడం 251 ఫోన్ల కంపెనీకి సంబందించి రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది. కేవలం 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ఇస్తాననడంతో ప్రతి ఒక్కరు కొనడానికి ఉత్సాహం చూపించారు. కోట్ల మంది ఫోన్ ను కొనుక్కోవడానికి ముందుకు వచ్చారు. దీనిపై ఒకవైపు వివాదం కొనసాగుతుండగా... మరో వైపు ఫోనును ఏప్రిల్ చివరి నుంచీ అందిస్తామని రింగింగ్ బెల్స్ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్‌ను రూ.251కే అందిస్తామని చెప్పిన రింగింగ్ బెల్స్ అదిరిపోయే ట్విస్ట్ ను ఇచ్చింది.

ఒక్కో స్మార్ట్‌ఫోన్‌ను 3,600రూపాయల ధరకు మొత్తం వెయ్యి ఫోన్లను రింగింగ్ బెల్స్‌కు సరఫరా చేశామని ఐటీ ఉత్పత్తుల సంస్థ యాడ్‌కామ్ పేర్కొంది. రింగింగ్ బెల్స్ కంపెనీ రూ.251కు స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించాలన్న ఆలోచన గురించి తమకేమీ తెలియదని యాడ్‌కామ్ వివరించింది. తమ బ్రాండ్‌నేమ్‌కు హాని కలిగించే కార్యకలాపాలను రింగింగ్ బెల్స్ చేపడితే, ఆ సంస్థకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అడ్వాండేజ్ కంప్యూటర్స్(యాడ్‌కామ్) చైర్మన్ సంజీవ్ భాటియా చెప్పారు. అంటే వీరు వేరే కంపెనీ దగ్గర కొని దాన్ని 251 రూపాయలకు అమ్మడానికి చూస్తోందా అని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రింగిండ్ బెల్స్ కంపనీ కార్యకలాపాల మీద ఇప్పటికే నిఘా ఏర్పాటు చేసింది. మరి గడువులోపు సెల్ ఫోన్లను సరఫరా చేస్తుందా లేదా అన్నది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Freedom 251  Smart Phone  Ringing Bells  

Other Articles