Dadasaheb Phalke award for veteran actor Manoj Kumar

Dadasaheb phalke award for veteran actor manoj kumar

Dadasaheb Phalke award , Actor Manoj Kumar, Dadasaheb award, Manoj kumar

Veteran actor and director Manoj Kumar will be conferred the 47th Dadasaheb Phalke Award for the year 2015. The award — conferred by the Centre for outstanding contribution to the growth and development of Indian Cinema — consists of a Swarn Kamal (Golden Lotus), a cash prize of Rs 10 lakh and a shawl.

మనోజ్‌కుమార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

Posted: 03/05/2016 09:00 AM IST
Dadasaheb phalke award for veteran actor manoj kumar

దేశ సినీ చరిత్రలో తనకంటూ సువర్ణాక్షరాలతో చరిత్ర రాసుకున్న సుప్రసిద్ధుడైన నాటి తరం నటుడు, దర్శకుడు మనోజ్‌కుమార్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. భారతీయ సినిమా అభివృద్ధికి విశేష కృషి చేసినందుకు 78 ఏళ్ల మనోజ్‌కుమార్‌ ను ఐదుగురు సభ్యులున్న జ్యూరీ 2015వ సంవత్సరానికిగాను 47వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసిందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జ్యూరీలో లతామంగేష్కర్, ఆశాభోస్లే, సలీమ్‌ఖాన్, నితిన్ ముఖేశ్, అనూప్ జలోటా ఉన్నారు. వీరంతా ఏకగ్రీవంగా మనోజ్‌కుమార్‌ను ఎంపిక చేయడం గమనార్హం. ఈ అవార్డుకింద మనోజ్‌కుమార్‌కు స్వర్ణ కమలం, 10 లక్షలు, శాలువా బహుమతిగా దక్కనున్నాయి.

మనోజ్‌కుమార్ 1937, జూలై 24వ తేదీన అబోటాబాద్ (ప్రస్తుతం పాకిస్థాన్)లో జన్మించారు. అసలు పేరు హరిక్రిష్ణ గిరి గోస్వామి. ఆయన పదో ఏట వారి కుటుంబం ఢిల్లీకి వచ్చి స్థిరపడింది. ఆయన హిందూ కాలేజీలో డిగ్రీ పట్టా అందుకున్నారు. 1957లో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన మనోజ్‌కుమార్ తొలిసారిగా హీరోగా 1960లో కాంచ్ కీ గుడియా సినిమాలో నటించారు. 1992లో కేంద్ర ప్రభుత్వం మనోజ్‌కుమార్‌కు పద్మశ్రీ ప్రదానం చేసింది. ఏడుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకొన్నారు. 1995లో మైదాన్ ఎ జంగ్ సినిమాలో నటించిన ఆయన ఆ తర్వాత నటనకు స్వస్తి పలికారు. అయితే, 1999లో దేశభక్తి కథాంశంతో జై హింద్‌అనే సినిమాకు దర్శకత్వం వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dadasaheb Phalke award  Actor Manoj Kumar  Dadasaheb award  Manoj kumar  

Other Articles