Rahul gandhi showed Potharaju drama in Parliament

Rahul gandhi showed potharaju drama in parliament

Rahul Gandhi, AICC Vice President, Parliament, Rahul Gandhi speech, Congress

AICC Vice President Rahul gandhi perform his Potharaju act in the Parliament.

పార్లమెంట్ లో రాహుల్ గాంధీ పోతురాజు వేషాలు

Posted: 03/03/2016 03:59 PM IST
Rahul gandhi showed potharaju drama in parliament

ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాందీ నిన్న పార్లమెంట్ సమావేశాల్లో చాలా కష్టపడి మాట్లాడారు. గత కొంత కాలంగా తాను మాట్లాడితే మోదీ గారు భయపడుతున్నారని. అందుకే తనను మాట్లాడనివ్వడం లేదని పార్లమెంట్ బయట రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే నిన్న రాహుల్ గాంధీ మాట్లాడారు. రాహుల్ గాంధీ మాట తీరుతో కాంగ్రెస్ వర్గాలు సంతృప్తిగా ఉన్నాయి. ఆయన ప్రతి లైన్ లో ప్రభుత్వం మీద కౌంటర్ వేసినట్లు తెగ సంబరపడ్డాయి. రోహిత్ వేముల ఆత్మహత్య నుండి మేకిన్ ఇండియా వరకు అన్ని అంశాల మీద రాహుల్ మాట్లాడారు. అయితే గతంలో మాదిరిగానే ఈ సారి కూడా పేపర్లో రాసుకొన్ని స్ర్కిప్ట్ ను చూస్తూ పంచ్ లు పేల్చారు.

రాహుల్ గాంధీ నిన్నటి పార్లమెంట్ ఉపన్యాసాన్ని వెంటే సంబరాల్లో సందడి చేసే పోతురాజు గుర్తుకు వచ్చారు. పోతురాజు ఎక్కడ ఉన్నా కానీ హల్ చల్ చేస్తూ అందరి దృష్టిని తనవైపు మళ్లేలా చేసుకుంటారు. అచ్చంగా రాహుల్ గాంధీ కూడా అదే ఫార్ములాను ఫాలోఅయినట్లు కనిపిస్తోంది. ప్రతపక్ష పార్టీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాల్సి ఉన్న రాహుల్ గాంధీ వ్యవస్థాగత సలహాలు ఇవ్వకుండా నాలుగు మాటలు మాట్లాడారు. మధ్యలో పంచ్ లు వేసి కాంగ్రెస్ ఎంపీలు బల్లలు చరిస్తే సంబరపడ్డారు. రాహుల్ గాంధీ వేసిన ప్రతి పంచ్ కు. ప్రతి ప్రశ్నకు కూడా మోదీ నేరుగా సమాధానమిచ్చారు. రాహుల్ గాంధీ ఎప్పటిలాగానే మరోసారి ఆర్ఎస్ఎస్ మాట లేకుండా తన ప్రసంగాన్ని కొనసాగించలేకపోయారు.

మేకిన్ ఇండియా మీద జోకులు.....
ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేకిన్ ఇండియా కార్యక్రమం మీద జోకులు పేల్చారు. మోదీ ప్రభుత్వం మేకిన్ ఇండియా అనే బబ్బర్ షేర్ ను తయారు చేసిందని.. ఎక్కడికి వెళ్లినా ఆ షేర్ కనిపిస్తోందని అన్నారు. ఆ సింహంలో మెషీన్లు తిరుగుతాయని.. అంతా షో చేస్తున్నారని అన్నారు. దీని మీద మోదీ స్పందించారు. మేకిన్ ఇండియా మీద జోకులు వెయ్యడం మీద మండిపడ్డారు. మేక్ ఇన్ ఇండియాలో లోపాలు ఉండవచ్చునని,  కానీ, అపహాస్యం చేయవద్దన్నారు. నిబంధనలు పాటిస్తే.. చర్చలు మరింత ఫలవంతమవుతాయని గతంలో  రాజీవ్ గాంధీ  చేసిన సూచనలను  ఈ సందర్భంగా ప్రధాని  గుర్తు చేశారు.  పథకం మంచిది కాదని  విమర్శించడం కాదని, తగిన సూచనలు చేయడం , పరిష్కారం చూపడం కూడా  ప్రతిపక్షం బాధ్యత అని  మోదీ అన్నారు

ఇక రోహిత్ వేముల వంతు...
ప్రభుత్వం రోహిత్ వేముల వంటి పేద, దళిత విద్యార్థుల గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. రోహిత్ వేముల లాంటి ఎంతో మంది దళిత, మైనార్టీ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం గొంతునొక్కేందుకు సిద్దంగా ఉందని కానీ తాము మాత్రం అలా జరగనివ్వమని అన్నారు. అయితే గతంలోనే రోహిత్ వేముల ఆత్మహత్య మీద కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్ లో వివరణి ఇచ్చారు. కాగా తాజాగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కాస్త గమనించాలి. మోదీ ప్రభుత్వం దళితులను, పేదలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. అయితే మోదీ సర్కార్ తాజా బడ్జెట్ ను చూసిన వారు ఎవరైనా ఈ మాటలను ఖండిస్తారు. దళిత పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇచ్చింది. అలాగే అన్ని రకాలుగా దళితులు అభివృద్ది చెందేందుకు వివిధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.

యువతకు ఉద్యోగాలు ఎక్కడ....?
రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మరో ప్రశ్నను కూడా సంధించారు. రెండు కోట్ల మంది యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని కానీ నిజానికి ఉద్యోగాలు ఎవరికి వచ్చాయని ప్రశ్నిస్తే మాత్రం తెలియదు అని చేతులెత్తుతున్నారని రాహుల్ అన్నారు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ ఓ విషయాన్ని మరిచిపోయారు. మేకిన్ ఇండియా కార్యక్రమం అసలు ఉద్దేశం ఏంటీ అంటే దేశీయంగా ఉత్పత్తులను పెంచడంతో పాటుగా యువతకు ఉద్యోగావకాశాలను కల్పించడమే. అందుకే మోదీ సర్కార్ ఈ బడ్జెట్ లో యువతలో స్కిల్ డెవలప్ మెంట్ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతోనే మోదీ సర్కార్ అసలు నిబద్దత ఏంటో అర్థమవుతుంది. కానీ దీని మీద రాహుల్ గాంధీ మాత్రం ప్రశ్నిస్తారు..

అదే పాత పాట.. ఆర్ఎస్ఎస్ పాట...
రాహుల్ గాంధీ మోదీ సర్కార మీద మాట్లాడిన వంద ఉపన్యాసాలను తీస్తే అందులో తొంభై ఎనిమిది ఉపన్యాసాల్లో ఆర్ఎస్ఎస్ పేరు లేకుండా మాట్లాడలేరు. సైద్దాంతికంగా కాంగ్రెస్ పార్టీకి, ఆర్ఎస్ఎస్ కు ఎక్కడా కూడా పొసగదు అని అందరికి తెలుసు. కానీ ప్రతీసారి రాహుల్ గాంధీ మాత్రం ఆర్ఎస్ఎస్ పేరును తీసుకోవడం వల్ల మోదీ సర్కార్ మీద విమర్శించడానికి అవకాశాలు లేకనే అలా ఆర్ఎస్ఎస్ పేరు తీసుకుంటున్నారని అనిపిస్తోంది. అయినా ఓ సంస్థ గురించి పార్లమెంట్ లో పదేపదే మాట్లాడటం పద్దతి కానేకాదు. సరే అయినా కూడా ఆర్ఎస్ఎస్ మీద ప్రశ్నించాల్సిన అవసరం ఎక్కడా లేదు. ప్రభుత్వంతో ఆర్ఎస్ఎస్ కు ఎక్కడా కూడా ప్రత్యక్ష సంబందాలు లేవు. బిజెపి నాయకుల మాతృ సంస్థ ఐన ఆర్ఎస్ఎస్ నిజంగా అంత ప్రమాదకారి అయితే వారి హయాంలోనే దాని మీద నిషేదం విధించి ఉండవచ్చు. నిజానికి ఆర్ఎస్ఎస్ కు కొన్ని సిద్దాంతపరమైన కట్టుబాట్లు ఉన్నా కానీ ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది.

గాంధీ Vs సావర్కర్...
రాహుల్ గాంధీ మరోసారి గాంధీ మార్క్ రాజకీయాలు ప్రదర్శించారు. మహాత్మా గాంధీ మీద పూర్తి పేటెంట్ హక్కులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్లు రాహుల్ గాంధీ మాట్లాడారు. మాది గాంధీ వర్గం.. మీద సావర్కర్ సిద్దాంతం అని అన్నారు. అలాగే మాది అహింసా మార్గం అలాగే మీద మాత్రం హింసా మార్గం అని అన్నారు. దీని మీద బిజెపి ఎంపీలు నిరసన తెలపడంతో రెచ్చిపోయిన రాహుల్ గాంధీ సావర్కర్ ను ఎత్తేశారా..? అంటూ ప్రశ్నించారు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ రెండు విషయాలను గమనించాలి. ఒకటి... గాంధీ, సావర్కర్ ఇద్దరూ కూడా దేశ ప్వాతంత్రం కోసం పోరాడిన వాళ్లే. వారి ఇద్దరికి ఒకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక రెండోది.. గాంధీ మీద పూర్తి హక్కులు మాకు ఉన్నాయని మరోసారి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. గాంధీ కార్డుతో ఇంకా ఎంతో కాలం నెట్టుకురాలేరని రాహుల్ గాంధీ గుర్తించలేకపోతున్నారు.

రాహుల్ గాంధీ చాలా కాలం తర్వాత బాగా మాట్లాడారని... కాంగ్రెస్ వర్గాలు భుజాలు తడుముకుంటున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన అవసరం ఒకటి ఉంది. రాహుల్ గాంధీ మేకపోతు గాంభీర్యాన్ని ఎన్నో రోజులు ప్రదర్శించలేరు. ప్రభుత్వాన్ని విమర్శించాలి.. అంతకన్నా ముందు మన తరఫున ఎలాంటి తప్పు లేకుండా చూసుకోవాలి. రాహుల్ గాంధీ నిజానికి విమర్శించాలి కానీ అది కాకుండా మోదీని టార్గెట్ గా చేసుకుంటూ విమర్శించడం మీద సర్వత్రా విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ చేసినే వ్యాఖ్యల మీద ఎందుకు మీడియాలో భారీగా కామెంట్లు వస్తున్నాయో గమనించి అయ్యావార్లు ముందుకు సాగితే బాగుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  AICC Vice President  Parliament  Rahul Gandhi speech  Congress  

Other Articles