Police Arrested Principal Babu Rao

Police arrested principal babu rao

Babu Rao, Rishiteshwari, Rishiteshwari Suicide, AP, Chandrababu, ganta Srinivas

In Rishiteshwari Suicide case police arrested him. He escaped to America after Rishiteshwari suicide.

రిషితేశ్వరి కేసులో... ప్రిన్సిపాల్ బాబు రావు అరెస్టు

Posted: 03/03/2016 09:32 AM IST
Police arrested principal babu rao

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ బాబురావును పెదకాకాని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రిషితేశ్వరిపై ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులను బాబూరావు ప్రోత్సహించినందుకు ఆయన్ని అరెస్టు చేయాలంటూ ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించడం, పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిన విషయమే.

ఈ సంఘటన జరిగిన తర్వాత బాబురావుపై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన అమెరికాకు వెళ్ళిపోయాడు. కొన్ని పరిణామాల దృష్ట్యా ఇండియాకు తిరిగి వచ్చిన బాబూరావును గుంటూరులోని ఆయన నివాసంలో ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. బాబూ రావును న్యాయస్థానంలో హాజరుపరచగా, ఆయనకు రెండు వారాల రిమాండ్ విధించారు. దాంతో గుంటూరు సబ్ జైలుకు తరలించారు. అయితే రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఏపి ప్రభుత్వం వత్తిళ్లకు తలొగ్గి కావాలనే బాబురావును తప్పించేందుకు ప్రయత్నాలు చేసిందని సర్వత్రా విమర్శలు వినిపించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Babu Rao  Rishiteshwari  Rishiteshwari Suicide  AP  Chandrababu  ganta Srinivas  

Other Articles