Must have Helmet and Driving Licence in Hyderabad

Must have helmet and driving licence in hyderabad

Hyderabad, Helmets, License, Motorists

Hyderabad Police implementing Court Orders. Motorists must have Helmets.

హెల్మెట్, లైసెన్స్ ఉన్నాయా..? లేకుంటే కష్టమే

Posted: 03/02/2016 01:38 PM IST
Must have helmet and driving licence in hyderabad

హైదరాబాద్ లో వాహనదారులుకు హెల్మెట్ భయం పట్టుకుంది. అందుకే తాజాగా హెల్మెట్ షాపులకు పరుగులు పెడుతున్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్సుల కోసం ఆర్టివో ఆఫీసులకు క్యు కడుతున్నారు. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ సిఫార్సులను  హైదరాబాద్‌ పోలీసులు అమలు చేస్తున్నారు. ఇప్పటికే హెల్మెట్ పెట్టుకోవాలని పలు రకాలుగా వాహనదారులకు 15 రోజుల పాటు అవగాహన కల్పించారు. హెల్మెట్ పెట్టని వారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. మొదటిసారి తప్పిదానికి కేసు నమోదు చేసి ఛలానా విధిస్తారు. ఇదే పొరబాటు మరో రెండుసార్లు చేస్తే ఏకంగా వారిపై ఛార్జిషీట్ వేసి జైలుకు పంపిస్తారు.

జంటనగరాల్లోని 25 ట్రాఫిక్ పోలీస్టేషన్ల పరిధిలోని ముఖ్య కూడళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాంతో వాహనదారులు హెల్మెట్ ల కోసం క్యు కడుతున్నారు. నిన్నటి దాకా హెల్మెట్  ధరిచండి అని ఎంతో ప్రచారం నిర్వహించినా కూడా పట్టించుకోని వాహనదారులు ఇప్పుడు వాయింపుల పర్వంతో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇక హెల్మెట్ అమ్మే దుకాణాలు వాహనదారులతో కిటకిటలాడుతున్నాయి. అయితే కొంత మంది మాత్రం పోలీసులు చౌరస్తాలలో లేకున్నా తమపై కేసు నమోదు కాదని అనుకుంటున్నారు. కానీ అక్కడి సీసీ కెమెరా పుటేజ్‌ల ఆధారంగా వాహనదారుడు హెల్మెట్ పెట్టకోకుంటే సదరు వాహన నెంబర్ ఆధారంగా కేసు నమోదు చేస్తారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిపై కూడా కఠినంగా వ్యవహరించనున్నారు. మొదటిసారి పట్టుబడితే అరెస్టు చేయడం, రెండోసారి పట్టుబడితే మూడు రోజుల జైలు శిక్ష, మూడోసారి పట్టుబడితే వారం రోజులు జైలు శిక్ష పడుతుంది. ఇక లైసెన్స్ లేకుండా ఎవరు నడిపినా వాహన యజమానిపై కేసు నమోదు చేస్తారు. మరి వాహనదారులారా తస్మాత్ జాగ్రత్త.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Helmets  License  Motorists  

Other Articles