India beat Sri Lanka by 5 wickets

India beat sri lanka by 5 wickets

India, Srilanka, T20, T20 World Cup, Dhoni, Yuvraj

Virat Kohli (56 not out) once again played the central role in India’s 5-wicket win over Sri Lanka. With this win, India enterd the Final of the Asia Cup T20. India are unbeaten in the tournament so far. There are some more positives for India from this match. Yuvraj Singh (35 off 18 balls) finally showed some stroke-making of his past self. Though he still looked shaky but today’s innings should give a lot of confidence. Suresh Raina to played a good knock too.

ఫైనల్ కు చేరిన టీమిండియా.. శ్రీలంకపై విక్టరీ

Posted: 03/02/2016 09:37 AM IST
India beat sri lanka by 5 wickets

ఆసియాకప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా మూడో విజయంతో ధోనీసేన హ్యాట్రిక్‌ కొట్టింది. దీంతో పాటు మరో మ్యాచ్‌ మిగిలుండానే ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది. మంగళవారం జరిగిన తమ మూడో లీగ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంకపై ఐదు వికెట్లతో టీమిండియా ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని భారత మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఐదు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఆరంభంలోనే ఓపెనర్లు శిఖర్‌ ధవన్‌, రోహిత శర్మ వికెట్లు కోల్పోవడంతో కాస్త కంగారు పడ్డా.. డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌, ఛేజింగ్‌ కింగ్‌ కోహ్లీ 56రన్లతో ఇండియాను విజయ తీరాలకు చేరవేశాడు.

అంతకుముందు టాస్‌ నెగ్గిన ధోనీ లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వెటరన్‌ పేసర్‌ ఆశీష్‌ నెహ్రా తన రెండో ఓవర్లోనే ఓపెనర్‌ దినేశ్‌ చాందిమల్‌ను అవుట్‌ చేయగా, తర్వాతి ఓవర్లోనే బుమ్రా గుడ్‌ లెంగ్త్‌ బంతితో జయసూర్యను పెవిలియన్‌కు పంపాడు. ఇక రెండు ఫోర్లు కొట్టి జోరందుకున్న దిల్షాన్‌ను తన తొలి బంతికే పాండ్యా అవుట్‌ చేశాడు. కాసేపు పోరాడిన కెప్టెన్‌ ఏంజెలో మాథ్యూస్‌నూ క్లీన్‌బౌల్డ్‌ చేసి లంకను కోలుకోలేని దె బ్బకొట్టాడు. ఈ దశలో కపుగెదెర, సిరివర్దనె జట్టును ఆదుకు నే ప్రయత్నం చేశారు. అయితే సిరివర్దనను అవుట్‌ చేసిన అశ్విన్‌ ఈ జోడీని విడదీశాడు. అదే ఓవర్లో షనక రనౌటయ్యాడు. ఇక బుమ్రా బౌలింగ్‌లో పాండ్యా పట్టిన మంచి క్యాచ్‌కు కపుగెదెర వెనుదిరిగాడు. అయితే క్రమంగా వికెట్లు పడగొట్టినా చివర్లో బౌలర్లు పరుగులు ఇచ్చుకున్నారు. ఆఖర్లో పెరీర వేగంగా ఆడి లంకకు గౌరవప్రద స్కోరందించాడు

యువరాజ్‌ చాన్నాళ్ల తర్వాత తనలోని హిట్టర్‌ను మేల్కొలిపాడు. తానెదుర్కొన్న రెండో బంతినే బౌండ్రీకి పంపిన యువీ.. హెరాత్ వేసిన 13వ ఓవర్‌ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. పెరీర బౌలింగ్‌లోనూ భారీ సిక్సర్‌ బాదాడు. అయితే పెరీర వేసిన 17వ ఓవర్లో బౌండ్రీ కొట్టిన యువీ తర్వాతి బంతికే హుక్‌ షాట్‌ ఆడి ఫైన్‌లెగ్‌లో కులశేఖరకు చిక్కాడు.బ్యాట్స్‌మన్‌గా మునుపటిలా రాణించలేకపోతున్న కెప్టెన్‌ ధోనీ కీపింగ్‌లో మాత్రం అదరగొడుతున్నాడు. వికెట్ల వెనుకాల చురుగ్గా కదులుతూ.. ప్రత్యర్థులను దెబ్బ కొడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు పట్టిన ధోనీ, ఒక రనౌట్‌, స్టంపౌట్‌ చేసి నాలుగు వికెట్లలో భాగస్వామి అయ్యా డు. ముఖ్యంగా చివర్లో భారీ షాట్లు కొడుతున్న పెరీరను మహీ స్టంపౌట్‌ చేసిన తీరు మ్యాచ్‌కే హైలెట్‌! 19వ ఓవర్లో అశ్విన్‌ వైడ్‌ బంతికి పెరీర క్రీజు వదిలి ముందుకెళ్లి ఆడబోగా, మహీ రెప్పపాటులో వికెట్లను గిరాటేశాడు. ధోనీలో కాన్ఫిడెన్స్‌ చూసిన పెరీర అంపైర్లు చెప్పకముందే పెవిలియన్‌ బాట పట్టాడు.

మనోహర్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Srilanka  T20  T20 World Cup  Dhoni  Yuvraj  

Other Articles