Arun Jaitly gave green signal for Rahul Gandhi proposal

Arun jaitly gave green signal for rahul gandhi proposal

Arun Jaitly, Budget, Rahul Gandhi, Brailey paper, Budget, Budget 2016

Arun Jaitly gave green signal for Rahul Gandhi proposal. He said that no tax on Brailey paper by the proposals of AICC Vice President Arun Jaitly

రాహుల్ గాంధీ సూచనకు జైట్లీ గ్రీన్ సిగ్నల్

Posted: 02/29/2016 01:52 PM IST
Arun jaitly gave green signal for rahul gandhi proposal

దేశం మొత్తం ఎదురు చూస్తున్న 2016-17 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. కాగా ఈ బడ్జెట్ లో  కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, ఎంపీ  రాహుల్ గాంధీ చేసిన సూచనకు జైట్లీ బడ్జెట్ లో చోటు కల్పించారు. దీని మీద జైట్లీ స్వయంగా లోక్ సభలో వెల్లడించారు.  ప్రతిపక్షసభ్యులైతేనేం.. చక్కటి సూచనలు ఇస్తే పాటించి తీరతాం అని జైట్లీ అన్నారు.   అంధ విద్యార్థులు  ఉపయోగించే బ్రెయిలీ పేపర్ ను ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చామని జైట్లీ ప్రకటించారు. రాహుల్ గాంధీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. బ్రెయిలీ పేపర్ ను సుంకం నుంచి మినహాయించడంతో  అంధులకు  ఊరట లభించనుంది.

వ్యాధిగ్రస్తులు,  వృద్ధులపైనా కరుణ చూపారు. డయాలసిస్ పరికరాలకు బేసిక్ కస్టమ్స్, ఎక్సైజ్ పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వరకు ఆరోగ్య బీమా కల్పించేందుకు కొత్త పథకం ప్రారంభించనున్నట్టు జైట్లీ ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు అదనంగా  30 వేలు ప్రయోజనం అందజేస్తామని హామీయిచ్చారు. ఔషధాలను చౌకగా అందించేందుకు అదనంగా 300 జనరిక్ దుకాణాలను త్వరలో ప్రారంభిస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arun Jaitly  Budget  Rahul Gandhi  Brailey paper  Budget  Budget 2016  

Other Articles