No change in Income Tax

No change in income tax

Income Tax, Tax, Indian Budget, Union Budget, Budget 2016

Central finance Minister Arun Jaitly produce Budget 2016 in the parliament. He did not propose any change in the Income Tax.

ఆదాయపన్నులో మార్పులు లేవు

Posted: 02/29/2016 01:41 PM IST
No change in income tax

ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులేవీ లేవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. నిరమయి స్వాస్థ్య బీమా యోజన క్రింద సాధారణ బీమా పథకాలను సేవా పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు, చిన్న తరహా కంపెనీలకు ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ‘‘మేక్ ఇన్ ఇండియా’’ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు, పోటీ తత్వాన్ని పెంచేందుకు కస్టమ్స్, ఎక్సయిజ్ డ్యూటీ రేట్లలో తగిన సవరణలు చేస్తామని తెలిపారు. 2016 జూన్ నుంచి 2019 మార్చి మధ్యలో నగరాల్లో హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టినవారి లాభాల్లో పీఎం ఆవాస్ యోజన క్రింద నూటికి నూరు శాతం పన్ను మినహాయింపులు ఇస్తామన్నారు. మొదటిసారి ఇంటిని కొనేవారికి ఆ ఇంటి ధర రూ.50 లక్షల వరకు ఉన్నపుడు, వారు రూ.35 లక్షల వరకు రుణం తీసుకున్నపుడు రిబేటును మరో రూ.50 వేలు ఇస్తామన్నారు.

వివాద రహితమైన తక్కువ పన్ను విధానం దిశగా అడుగులేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. పరిశుద్ధ ఇంధన సెస్‌ పేరును పరిశుభ్ర పర్యావరణ సెస్‌గా మార్చుతున్నట్లు ప్రకటించారు. పన్ను చెల్లించదగిన అన్ని సేవలపైనా 0.5 శాతం కృషి కల్యాణ్ సెస్‌ను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈపీఎఫ్‌ఓ అందజేసే సేవలకు సేవా పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. సంవత్సరానికి రూ. కోటికి పైగా ఆదాయం గలవారికి సర్‌ఛార్జిని 15 శాతానికి పెంచుతున్నట్లు, గతంలో ఇది 12 శాతం ఉండేదని జైట్లీ చెప్పారు. మొదటిసారి గృహ కొనుగోలుదారులకు అదనపు పన్ను ప్రయోజనాలు కల్పించేందుకు ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. మెట్రో నగరాల్లో 30 చదరపు మీటర్ల స్థలంలో ఇళ్లు నిర్మించుకునేవారికి 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Income Tax  Tax  Indian Budget  Union Budget  Budget 2016  

Other Articles