Pakistani suicide bomber arrested in Kashmir Baramulla

Teen fidayeen of jaish e mohammad caught alive in jammu and kashmir

teen Fidayeen, Jaish-e-Mohammad, JeM, pak terrorist caught alive, terrorist, Baramulla, Jammu and Kashmir, Mohammad Sadiq Gujjar, army camp atack, Tanghdar, Kupwara district, pakistan

A teenage Fidayeen of Jaish-e-Mohammad (JeM) was caught alive from Baramulla in Kashmir. Identified as Mohammad Sadiq Gujjar, 17, he was part of the terror team that had attacked an army camp in Tanghdar in Kupwara district on November 25.

సజీవంగా చిక్కిన మరో పాకిస్థాన్ ఉగ్రవాది..

Posted: 02/26/2016 03:13 PM IST
Teen fidayeen of jaish e mohammad caught alive in jammu and kashmir

యావత్ ప్రపంచం విస్తుపోయేలా పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీష్ సహా ఆ దేశ మంత్రులు భారత్ తమ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందన్న బూటకపు వ్యాఖ్యలు చేశారు. అయితే వాటిని తోసి రాజుతూ.. పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాది సజీవంగా భారత్ బలగాలకు చిక్కాడు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిందన్న భారత్ సహా పలు దేశాల వాదనకు మరో బలమైన ఆధారం చిక్కింది. భారత్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో పాక్ కు చెందిన 17 ఏళ్ల ఫిదాయి సజీవంగా పట్టుబడ్డాడు.

గతేడాది నవంబర్ 25న కుప్వారా జిల్లా పరిధిలోని తంగ్దార్ సమీపంలోని ఆర్మీ క్యాంపుపై దాడికి పాల్పడ్డ ఈ మైనర్ ఫిదాయిని మొహ్మద్ సాధిక్ గుజ్జార్ గా గుర్తించారు. పాకిస్థాన్ లోని సియాల్ కోట్ కు చెందిన గుజ్జార్ ను పఠాన్ కోట్ దాడికి సూత్రధారిగా వ్యవహరించిన మౌలానా మసూద్ అజార్ నేతృత్వంలోని ఉగ్రవాద సంస్థ జైషే మొహ్మద్ సభ్యుడిగా సైన్యం నిర్ధారించింది. మొత్తం నలుగురు ముష్కరుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న భారత బలగాలు జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా ప్రాంతంలో నిన్న ముప్పేట దాడికి దిగాయి. ఈ దాడిలో ముగ్గురు ముష్కరులు చనిపోగా, గుజ్జార్ సజీవంగా పట్టుబడ్డాడు. అరెస్ట్ సందర్భంగా అతడి వద్ద నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను సైన్యం స్వాధీనం చేసుకుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu and Kashmir  Jash-e-Mohammad  JeM  Pakistan  

Other Articles