Jagan said that Foolish Chandrababu Naidu

Jagan said that foolish chandrababu naidu

Jagan, Chandrababu Naidu, TDP, YSRCP,YSR Congress

Jagan said that Foolish Chandrababu Naidu. He said that Chandrababu Naidu have to gain the peoples love but not MLAs.

తిక్క చంద్రబాబు అన్న జగన్

Posted: 02/26/2016 09:29 AM IST
Jagan said that foolish chandrababu naidu

ఎమ్మెల్యేలను కొన్నంత మాత్రానా ప్రభుత్వాలు నిలబడవన్నారు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్. ప్రజల గుండెల్లో స్ధానం లభించినప్పుడే మనుగడ సాధ్యమన్న విషయం చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలన్నారు. వైసీపీ పార్టీ పెట్టినప్పుడు తాను అమ్మ మాత్రమే ఉన్నామన్న జగన్ ఈ రోజు 67కు చేరిందని అన్నారు. ఒకరిద్దరు పోయినంత మాత్రానా పార్టీకి ఏమీ కాదని తెలిపారు. మైనింగ్ లు , కాంట్రాక్టులు, పదవులను చూయించి ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో కొంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు దమ్ముంటే పార్టీలోకి వచ్చిన వైసీపీ నేతలను రాజీనామా చేయించి పోటీ చేయించాలన్నారు.

రిగ్గింగులతో, పోలీసులతో రాజకీయ చేయలేమన్న జగన్... అలా చేస్తే చివరికి బంగాళాఖాతంలో కలిసి పోవాల్సిందేనని అన్నారు. ఈ రోజు కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్ పైవిధంగా స్పందించారు.మరో ఏడాది తర్వాత చంద్రబాబు అసలు స్వరూపం బయటపడి అందరు ఎమ్మెల్యేలు తిరిగి తన పార్టీలోకి చేరతారని అన్నారు. కాగా దిల్లీ పర్యటనలో జగన్ ఉన్న సమయంలో పార్టీ నాయకులు చాలా మంది తెలుగుదేశ: పార్టీ తీర్థం నుచ్చుకోవడం మీద ఆయన విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Jagan  Chandrababu Naidu  TDP  YSRCP  YSR Congress  

Other Articles