Johnson & Johnson verdict: Can talcum powder really cause cancer?

Johnson johnson verdict can talcum powder really cause cancer

Johnson & Johnson , Cancer, Powder, Talcum Powder

When a St. Louis jury awarded $72 million this week to the family of a woman who died from ovarian cancer, which she claimed was caused by using Johnson & Johnson talcum powder, it prompted many questions about just how safe such products really are.

జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ వల్ల క్యాన్సర్..?

Posted: 02/26/2016 09:27 AM IST
Johnson johnson verdict can talcum powder really cause cancer

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి భారీ షాక్ తగిలింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేస్తున్న వస్తులపై ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  బేబీ పౌడర్, ప్రిక్లీ హీట్ పౌడర్‌లను కొన్ని ఏళ్లుగా వాడుతున్న ఓ మహిళ అండాశయ కేన్సర్ తో మరణించింది. దీంతో ఆ కంపెనీ ఆమె కుటుంబానికి సుమారు రూ. 493 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని అమెరికా కోర్టు తీర్పు చెప్పింది.  జాకీ ఫాక్స్(62) ఒవేరియన్ కాన్సర్‌తో 2013లో మరణించారు. దీంతో జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ల టాల్కం పౌడర్‌ను దీర్ఘకాలం పాటు వాడడం వల్లే తన తల్లి అనారోగ్యానికి గురయ్యారని ఆరోపించారు.

 టాల్క్ బేస్‌డ్ ఉత్పత్తుల వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్న విషయాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించలేదని చెప్పారు. ఇదే అంశంపై మిస్సోరి కోర్టులో 1000కేసులు, న్యూజెర్సీ కోర్టులో మరో 200 కేసులు నమోదయ్యాయి. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ మోసం చేసిందని, నిర్లక్ష్యం వహించిందని, కుట్రపూరితంగా వ్యవహరించిందని జ్యూరీ తేల్చినట్లు ఫాక్స్ కుటుంబం తరపు న్యాయవాదులు తెలిపారు. తమ ఉత్పత్తులతో ఈ ప్రమాదం ఉందన్న విషయం ఆ కంపెనీకి 1980ల నుంచే తెలుసుని మరో న్యాయవాది ఆరోపించారు. కాగా, కంపెనీ వ్యవహరించిన తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ తీర్పుతో కంపెనీ ప్రతినిధి కరోల్ బ్రిక్స్ విభేదించారు. బాధిత కుటుంబం పట్ల తమకు సానుభూతి ఉందని.. ఆమె క్యాన్సర్‌కు తమ ఉత్పత్తుతలకు సంబంధం లేదని, ఈ తీర్పును సవాల్ చేయనున్నామని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Johnson & Johnson  Cancer  Powder  Talcum Powder  

Other Articles