Another shocker to YSRCP as Badvel MLA Jayaramulu joins TDP

Another shocker to ysrcp as badvel mla jayaramulu joins tdp

TDP, YSRCP, Jagan, MLA Jayaramulu, Kadapa, Payyavula Keshvlu

While YSR Congress party is still reeling under the shock of five of the party leaders switching loyalties and joining the ruling TDP, another shocker has come for the party as Badvel MLA Jayaramulu of Kadapa district too decided to join Telugu Desam party.

మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలోకి

Posted: 02/24/2016 02:58 PM IST
Another shocker to ysrcp as badvel mla jayaramulu joins tdp

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహనరెడ్డికి తన సొంత జిల్లా కడపలోనే మరో షాక్ తగిలింది. బద్వేల్ ఎమ్మెల్యే  త్రివేది జయరాములు వైసీపీకి గుడ్ బై చెప్పారు. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో జయరాములు తెలుగుదేశంలో చేరారు. పార్టీ కండువా కప్పి సీఎం ఆయన్ని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఇప్పటికే సైకిలెక్కారు. అయితే సీఎం తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లాకు వస్తుండటంతో జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా వేగంగా సాగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులను చూసే చాలా మంది పార్టీలోకి చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవులు వెల్లడించారు. అధికార పార్టీ చేస్తున్న అభివృద్దికి సహకరించాలనే ఇలా తమ పార్టీలోకి చేరుతున్నారని జయరాములు చేరిన తర్వాత పయ్యావుల అన్నారు. ఇక జగన్ నీతి వ్యాఖ్యలు చెయ్యడం మీద కూడా ఆయన మండిపడ్డారు. గతంలో వైయస్ రాజేఖర్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారడానికి రాజమార్గం వేసింది ఆయన కాదా అని జగన్ ను ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  YSRCP  Jagan  MLA Jayaramulu  Kadapa  Payyavula Keshvlu  

Other Articles