Smriti Irani vs Mayawati In Rajya Sabha

Smriti irani vs mayawati in rajya sabha

Smriti Irani, mayavathi, HCU, Rohith Vemula, parliament

Angry exchanges, slogan-shouting and three adjournments in the first hour after the Rajya Sabha convened, blew a big hole today in the agreement between the government and opposition for a "disruption-free" Budget session of Parliament.

రాజ్యసభలో మాయావతి Vs స్మృతి ఇరానీ

Posted: 02/24/2016 03:09 PM IST
Smriti irani vs mayawati in rajya sabha

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మాహత్య ఘటన ఇవాళ రాజ్యసభలో రభస సృష్టించింది. ఇదే అంశంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, బీఎస్పీ నేత మాయావతి మధ్య మాటల యుద్ధం సాగింది. రోహిత్ మృతిపై వివరణ ఇవ్వాలని మాయావతి సభలో డిమాండ్ చేశారు. చర్చకు బదులుగా ప్రభుత్వ ముందుగా సమాధానం ఇవ్వాలని మాయావతి చేసిన డిమాండ్‌ను స్మృతీ ఇరానీ తప్పుపట్టారు. రోహిత్ మృతి పట్ల ప్రభుత్వం సమాధానం ఇస్తుందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినా బీఎస్పీ నేతలు సభలో గందరగోళం కొనసాగించారు. దాంతో కేంద్ర మానవవనరులశాఖ మంత్రి స్మృతీ ఇరానీ జోక్యం చేసుకున్నారు.

హెచ్‌సీయూ ఘటనపై ఏర్పాటు చేసిన కమిటీలో దళిత సభ్యుడు కూడా ఉన్నారని స్మృతీ ఇరానీ సభకు స్పష్టం చేశారు. ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె మాయావతిని ప్రశ్నించారు. దాంతో మళ్లీ విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తారు. రోహిత్ ఘటనపై హెచ్‌ఆర్డీ మంత్రి స్మృతీ ఇరానీ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ గందరగోళం మధ్య మళ్లీ సభను వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smriti Irani  mayavathi  HCU  Rohith Vemula  parliament  

Other Articles