SpiceJet website crashes on pre-summer offer, fares start at Rs 599

Spicejet launches pre summer sale with fares starting rs599

spicejet offers 2016, spicejet rs 599 offer, spicejet ticket sale offer, spicejet flight ticket sale, spicejet summer sale offer, spicejet pre summer sale, spicejet super summer sale, spicejet summer sale offer, spicejet off season sale, off season sale, spicejet super summer sale booking, spicejet airlines summer sale, spicejet offers today, spicejet ticket offers today, spicejet special offers today, spicejet offers for domestic flights today

SpiceJet offers 2016: Budget airline has launched its ‘Pre-Summer Sale’ with red hot fares across its domestic network pegging its base ticket price as low as Rs 599.

స్పెస్ జెట్ వేసవి డిస్కౌంట్ ఆఫర్.. సైట్ క్రాష్

Posted: 02/23/2016 05:04 PM IST
Spicejet launches pre summer sale with fares starting rs599

చౌకధర విమానయాన సంన్థ స్పెస్ జెట్ మధ్య తరగతి ప్రయాణికులకు మరోమారు శుభవార్తను అందించింది. తాజాగా ఈ సంస్థ 'ప్రీ సమ్మర్ సేల్'ను ప్రారంభించింది. వేసవి సందర్భంగా ప్రీ సమ్మర్ సేల్ పేరుతో  స్పైస్ జెట్ టికెట్లు రూ.599కే (బేస్ ప్రైస్) అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఆఫర్  కేవలం దేశీయ విమాన సర్వీసులకు మాత్రమే వర్తిస్తుంది.  ఇవాళ్లి నుంచి (23వ తేదీ) ఫిబ్రవరి 25 అర్థరాత్రి  వరకూ  తీసుకున్న ప్రతీ టికెట్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది.
 
ఇవాళ్టి నుంచి 25వ తేదీ రాత్రి వరకు బుక్ చేసుకున్న టికెట్లతో మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 13 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. వేసవిలో బస్సు, రైలు ప్రయాణాల కన్నా విమాన ప్రయాణాలతో అత్యంత తక్కువ సమయంలో అత్యంత వేగంగా తమ గమ్యస్థానాలను చేరవచ్చునని ఈ సంస్థ ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఆఫర్ కింద టిక్కెట్లు తీసుకుంటే స్థానిక పన్నులు అదనంగా చెల్లించాల్సి వుంటుంది.

స్పైస్ జెట్ ఉన్నతాధికారి శిల్పా భాటియా మాట్లాడుతూ... తాము ప్రవేశపెట్టిన ప్రీ సమ్మర్ సేల్  విమాన ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ఆఫర్ ద్వారా ఓవైపు డబ్బు ఆదాతో పాటు మరోవైపు రద్దీని కూడా తప్పించుకోవచ్చన్నారు. కాగా ఈ ఆఫర్ ప్రకటించగానే ఎందరో కస్టమర్లు ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకునే పనిలో భాగంగా స్పెస్ జెట్ విమానయాన సంస్థకు చెందిన అన్ లైన్ సెట్ లోకి ఒకే సారి వెళ్లడంతో ఆ సైట్ క్రాష్ అయ్యింది. దీంతో సంస్థ యాజమాన్యం రంగంలోకి దిగి వేగిరంగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : spicejet  pre summer offer  discount offer  site crash  base price Rs.599  

Other Articles