Central Minister Sujana Chowdary Summoned By Court in loan Default Case

Central minister sujana chowdary summoned by court in loan default case

Sujana Chowdary, Sujana Group, Suajana companies, Sunajana Universal Industries, High Court

A metropolitan court issued summons to Union Minister of State for Science and Technology Y. Sujana Chowdary and directors of the company owned by him, Sujana Universal Industries, in a case related to evasion of loan borrowed from Mauritius-based Mauritius Commercial Bank. The bank filed a complaint over non-repayment of the loan.

సుజనా చౌదరి అప్పులు.. తెచ్చాయి తిప్పలు

Posted: 02/23/2016 03:48 PM IST
Central minister sujana chowdary summoned by court in loan default case

రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో కీలకంగా ఉన్న సీనియర్ టిడిపి నాయకుడు, ప్రస్తుత కేంద్ర మత్రి సుజనా చౌదరికి కంపెనీలకు తాజాగా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చేసిన అప్పులను తీర్చలేని కారణంగా సుజనా చౌదరికి హైకోర్టు ఈ మేరుకు నోటీసులు జారీ చేసింది. సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు కుమారుడు కళ్యాణ్ శ్రీనివాస్‌ వివిధ బ్యాంకులనుంచి 304 కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టాడని సీబీఐ నమోదు చేసిన కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. కళ్యాణ్ శ్రీనివాస్‌ ఎండీగా ఉన్న బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ బ్యాంకుల నుంచి తీసుకున్న 304 కోట్ల రుణాలూ నేరుగా నాలుగు కంపెనీలకు బదిలీ అయ్యాయి.

మరోవైపు విజయరామారావు కుమార్తె అన్నపూర్ణ నా సోదరుడు కళ్యాణ్ శ్రీనివాస్‌... సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్‌లో గతంలో పనిచేశారని, వారు కుట్రచేసి తమ సోదరుడిని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. తన సోదరుడికి అన్ని వందల కోట్లు రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. మారిషస్ బ్యాంక్ ఛీటింగ్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఆ కంపెనీలకు ఇప్పు డు తాను డైరెక్టర్‌ను కాదని..  కంపెనీల బాధ్యతల నుంచి తప్పుకొని 15 ఏళ్లయిందిని తెలిపారు. సుజనా యూనివర్సల్‌ సంస్థ మారిషస్‌ బ్యాంకు నుం చి రుణం తీసుకున్నప్పుడు కూడా తాను సంతకాలు చేయలేదని అన్నారు. ఇప్పుడు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ బాధ్యతల్లో మాత్రమే ఉన్నానని.... ఆయా కంపెనీల వివాదాల గురించి సంబంధిత కంపెనీలనే అడగాలని మీడియాకు సూచించారు.

అయితే సుజనా యూనివర్సల్‌ కంపెనీతో తనకు సంబంధం లేదంటూ సుజనా చౌదరి చేసిన ప్రకటనలో వాస్తవం లేదనిపిస్తోంది.  కేంద్రంలో మంత్రి పదవి చేపట్టడానికి ముందు వరకూ సుజనా యూనివర్సల్‌ తదితర కంపెనీలకు సుజనా చౌదరి డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ కంపెనీలో ఆగస్టు 22, 1986 నుంచి 2014 అక్టోబర్‌ 15 వరకు ఆయన డైరెక్టర్‌గా కొనసాగారు. మారిషస్‌ బ్యాంకు నుంచి సుజనా యూనివర్సల్‌ అనుబంధ కంపెనీ హేస్టియా హోల్డింగ్స్‌ 2012లో 100 కోట్ల రుణాన్ని తీసుకుంది. రుణం తీసుకున్న సమయంలోనూ, రుణం ఎగవేత దరిమిలా దీనిపై మారిషస్‌ బ్యాంకు అంతర్జాతీయ న్యాయస్థానాలను ఆశ్రయించింది.

సుజనా కంపెనీలకు తనకు ఎలాంటి సంబందం లేదని ప్రకటించినా నిజాలను మాత్రం దాచడం కష్టం అని ఆయన గుర్తించలేకపోయారు. నిజానికి సుజనా గ్రూప్‌ కంపెనీల్లో 2014 వరకూ ఆయన చురుగ్గానే ఉన్నారు. ఇదే గ్రూప్‌లోని మరో ముఖ్య కంపెనీ సుజనా టవర్స్‌లో ఆయన 1992 ఫిబ్రవరి 13 నుంచి 2014 అక్టోబర్‌ 15 వరకు డైరెక్టర్‌గా ఉన్నారు. సుజనా మెటల్‌ ప్రొడక్ట్స్‌, సుజనా పవర్‌ (గంగికొండన్‌) లిమిటెడ్‌, సుజనా పవర్‌ ఇండియా, సుజనా పవర్‌ (ట్యూటికోరిన్‌), సుజనా ఎనర్జీ, సుజనా ఫైనాన్స్‌ అండ్‌ ట్రేడింగ్‌, సుజనా హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, సుజనా ప్రాజెక్ట్స్‌ తదితర సంస్థలన్నింటిలోనూ 2014 అక్టోబర్‌ 15 వరకు ఆయన డైరెక్టర్‌గా కొనసాగారు. ఇవే కాకుండా ఫోస్టర్‌ ఇన్‌ఫిన్‌ అండ్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీలో 2014 అక్టోబర్‌ 15 వరకు, ఆఫ్‌బీట్‌ డెవలపర్స్‌ ప్రైవే ట్‌ లిమిటెడ్‌ కంపెనీలో 2010 జనవరి 29 వరకు సుజనా డైరెక్టర్‌గా ఉన్నారు.

సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అనుబంధ కంపెనీ అయిన హేస్టింగ్స్‌ హోల్డింగ్స్‌ పేరుతో మోసపూరితంగా తమ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారని, దాన్ని తిరిగి చెల్లించలేదని మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంకు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న 12వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ డేనియల్‌ రూథ్‌ నిందితులకు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్, దాని ఎండీ జి శ్రీనివాసరాజు, డైరెక్టర్‌ ఎస్ హనుమంతరావు, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుజనా చౌదరి, దాని అనుబంధ కంపెనీ హేస్టింగ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌లకు సమన్లు జారీ అయ్యాయి. కాగా దీని మీద సుజనా చౌదరి స్పందన మాత్రం వింతగా ఉంది. కోర్టులు తనకే కాదు మోదీ కూడా సమన్లు జారీ చేస్తాయని.. కానీ సుజనా కంపెనీలే దీనికి సమాధానం చెప్పాల్సి ఉందని అన్నారు. మరి చూడాలి దీనిని సుజాన ఎలా ఎదుర్కొంటారో..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles