Death threat to Salman Khan by an anonymous phone caller

Death threat to salman khan by an anonymous phone caller

salman Khan, Salman, Phone calls to Salman Khan, Mumbai, death threat to Salman Khan

An anonymous phone caller has threatened to kill Bollywood superstar Salman Khan, prompting the Mumbai Police to launch a probe, an official said today. The phone call was made to the city’s Police Control Room on February 16, police said. Police suspected it was a hoax call and launched a probe though no case has been filed yet.

సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు

Posted: 02/23/2016 04:45 PM IST
Death threat to salman khan by an anonymous phone caller

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు తాజాగా బెదిరింపులు వచ్చాయి. హిట్ అండ్ రన్ కేసులో ప్రస్తుతం కోర్టు నోటీసులు అందుకున్న సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ కొంత మంది అగంతకులు ఫోన్ చేసి బెదిరించారు. సల్మాన్ ఖాన్ ను చంపేస్తామన్న వార్తను సల్మాన్ ఖాన్ కు కాకుండా పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి మరీ చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.  ఫిబ్రవరి 16, 17 తేదీల్లో ముంబైలోని సిటీ పోలీస్ కంట్రోల్ రూంకు ఈ బెదిరింపు కాల్ వచ్చినట్టు  పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.  దక్షిణ ముంబై  శివారు మలద్ లోని పబ్లిక్ బూత్ నుంచి ఈ కాల్ వచ్చినట్టు పోలీసులు కనుగొన్నారు.

సల్మాన్ ఖాన్‌ను ఖతం చేస్తామని, సల్మాన్ త్వరలో చావబోతున్నాడు అని ముంబైలోని సిటీ పోలీస్ కంట్రోల్ రూంకు గుర్తుతెలియని వ్యక్తులు  ఫోన్ చేసినట్టు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఆ  సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దీన్ని ఫేక్ కాల్ గా పోలీసులు భావిస్తున్నప్పటికీ తేలికగా తీసిపారేయడానికి వీలులేదని కూడా అనుకొంటున్నారు.  అయితే సల్మాన్ ఖాన్ కు ఇలా ఫోన్ లో బెదిరింపులు రావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోని మరికొంత మంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman Khan  Salman  Phone calls to Salman Khan  Mumbai  death threat to Salman Khan  

Other Articles