HCU Students getting ready to protest at Jantarmantar

Hcu students getting ready to protest at jantarmantar

HCU, Hyderabad, Hyderabad central University, Rohith Vemula, Delhi, jantar Mantar

HCU Students getting ready to protest at Jantarmantar,. On Rohith Vemula suicide, HCU students palnned to protest at Delhi, jantarmantar.

రోహిత్ సూసైడ్ మీద జంతర్ మంతర్ వద్ద ధర్నా

Posted: 02/23/2016 10:19 AM IST
Hcu students getting ready to protest at jantarmantar

HCU  రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల సూసైడ్ పై జాయింట్ యాక్షన్ కమిటీ నిరసనలు కంటిన్యూ చేస్తూనే ఉంది. రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళనలు విరమించేది లేదని ప్రకటించిన స్టూడెంట్స్.. ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు రెడీ అయ్యారు. HCU నుంచే కాకుండా దేశంలోని అన్ని యూనివర్సిటీల నుంచి విద్యార్థులు ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు అంబేద్కర్ మొమోరియల్ నుంచి జంతర్ మంతర్ వరకు విద్యార్థులంతా కలిసి ర్యాలీ తీస్తారు. జంతర్ మంతర్ చేరుకున్నాక మద్యాహ్నం 12 గంటల నుంచి….సాయంత్రం 5 గంటల వరకు ధర్నా జరగనుంది.

రోహిత్ తల్లి  కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. స్డూడెంట్స్ నిరసనలకు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. ధర్నాలో పాల్గొనేందుకు నిన్న సాయంత్రమే ఢిల్లీ చేరుకున్న HCU స్టూడెంట్స్, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు AICC వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ధర్నాలో పాల్గొనాలని ఆహ్వానించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు వారి తరపున పోరాడుతానని రాహుల్ వారికి హామీ ఇచ్చారు. సీపీఐ నేతలు కూడా స్టూడెంట్స్ కు మద్దతు ప్రకటించారు.నిర్భయ చట్టంలాగే రోహిత్ చట్టం తేవాలంటున్నారు స్టూడెంట్స్. రోహిత్ మృతికి కారకులుగా ఆరోపిస్తున్న  కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీతో పాటు హెచ్ సీయూ వీసీ అప్పారావును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HCU  Hyderabad  Hyderabad central University  Rohith Vemula  Delhi  jantar Mantar  

Other Articles