vaiko says will arrest chandrababu if comes to power

Vaiko predicts change after assembly polls

Karunanidhi, Congress, DMK, Tamil Nadu elections, Vaiko, PWF, G K Vasan, Vijaykant, DMDK Chief Vijayakant, chandra babu, ap cm naidu, redsandal smugglers, tamilnadu labour, chandrababu jail, vaiko chandrababu, chandrababu vaiko

Marumalarchi Dravida Munnetra Kazhagam (MDMK) leader Vaiko said that he will send andhra pradesh chief minister chandra babu to jail for killing tamilnadu labour, if comes to power

అధికారంలోకి వస్తే చంద్రబాబును జైలుకు పంపిస్తా.

Posted: 02/23/2016 09:23 AM IST
Vaiko predicts change after assembly polls

ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయటే చాలు. అక్కడి రాజకీయ నాయకులు గుప్పించే హామీలు అసాధారణంగా వుంటాయి. ఉదాహరణకు మన రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న చంద్రబాబు హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఇక ఇది అమలుకు నోచుకోవాలంటే మరోమార ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందన్న వ్యంగోక్తులు కూడా వినబడుతున్నాయి. ఇక మన పోరుగున వున్నా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయంటే మాత్రం అక్కడి పలు రాజకీయ పార్టీల హామీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తాయి.

సరిగ్గా ఇలాంటిదే హామీనే గుప్పించారు ఎండీఎంకే పార్టీ నేత వైగో. తమ ప్రజలను అన్ని రకాలుగా ప్రభావితం చేసి ఓట్లు రాల్చుకోవాలనుకుంటున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న వ్యక్తిని, తాము అధికారంలోకి వస్తే... జైలుకు పంపుతామని అక్కడి ఓటర్లను తెలుగు ప్రజలు, తెలుగు నేతలంటే ఈసడించుకునేలా, పగతో రగిలేలా ప్రసంగాలు చేశారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని జైలుకు పంపుతామని సంచలన వ్యాఖ్య చేశారు.

ఈ క్రమంలో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో నిన్న ఆ రాష్ట్రంలోని కరూర్ లో జరిగిన ప్రచారంలో వైగో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల తిరుపతి సమీపంలో జరిగిన తమిళ కూలీల ఎన్ కౌంటర్ ను ప్రస్తావించారు. ఎర్రచందనం కూలీల పేరిట 20 మంది అమాయక తమిళ కూలీలను చంద్రబాబు ప్రభుత్వం ఎన్ కౌంటర్ చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్ కౌంటర్ పేరిట తమిళులను చంపేసిన ఏపీ సీఎం చంద్రబాబును... తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా జైలుకు పంపుతామని ఆయన సంచలన ప్రకటన చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vaiko  chandra babu  ap cm naidu  redsandal smugglers  tamilnadu labour  

Other Articles