SC issues notice to Salman Khan in hit-and-run case

Sc issues notice to salman khan in hit and run case

salman Khan, Supreme court, Hit and Run case

The Supreme Court on Friday directed film actor Salman Khan to respond to the appeal filed by the Maharashtra government against his acquittal by the Bombay High Court in the 2002 hit-and-run case. A Bench of Justices J.S. Khehar and C. Nagappan issued notice to Mr. Khan while noting that a decision by the Supreme Court would give finality in the 14-year-old case.

మరోసారి నోటీసులు అందుకున్న సల్మాన్ ఖాన్

Posted: 02/20/2016 08:19 AM IST
Sc issues notice to salman khan in hit and run case

పాపం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు హిట్ అండ్ రన్ కేసులో కష్టాలు మాత్రం తప్పడంలేదనిపిస్తోంది. బాంబే హైకోర్టు సల్మాన్ కు క్లీన్ చిట్ ఇచ్చినా కానీ తాజాగా మాత్రం మరోసారి అదే కేసులో నోటీసులు అందుకున్నారు. 2002 నాటి కేసులో ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును ఎందుకు రద్దు చేయకూడదో తెలుపాలని ఆ నోటీసులో పేర్కొంది. బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వంతోపాటు బాధిత కుటుంబాలు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ జగ్జిత్‌సింగ్ ఖేహర్, జస్టిస్ నాచియప్పన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణకు స్వీకరించింది. బాధిత కుటుంబం ఇంతవరకు తమకు ఎటువంటి నష్టపరిహారం అందలేదని తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా ఈ కేసును పరిశీలించాల్సిన అవసరం ఉంది అని వ్యాఖ్యానించింది. ఆరువారాల్లో కేసు విచారణ చేపడతామని స్పష్టం చేసిన న్యాయస్థానం.. బాధిత కుటుంబానికి నోటీసు జారీచేసింది. ఆయన ఈ కోర్టు నుంచి నిర్దోషిగా బయటపడితే అన్ని రకాల సమస్యల నుంచి విముక్తుడవుతాడు అని స్పష్టంచేసింది.

సల్మాన్‌ఖాన్ తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్‌సిబల్ ఘటన జరిగినప్పుడు సల్మాన్ కారు నడుపుతున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పారు. ఒక వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దోషిగా నిర్ధారించలేమని వాదించారు. సల్మాన్‌ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయాన్ని అవహేళన చేయడమేనని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన కొన్నేండ్ల తర్వాత ఘటన జరిగినప్పుడు ఆ కారును తాను నడిపానని డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా హైకోర్టు జారీ చేసిన ఆదేశంలో హేతుబద్ధత లేదన్నారు. సల్మాన్‌ఖాన్‌ను దోషిగా ధ్రువీకరిస్తూ గత ఏడాది మే నెలలో ముంబైలోని ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. 2002 సెప్టెంబర్ 28 రాత్రి సల్మాన్‌ఖాన్ తాగిన మత్తులో తన టయోటా కారును ముంబైలోని బంద్రా వద్ద పేవ్‌మెంట్‌పై నిద్రపోతున్న వ్యక్తి మీదుగా నడుపడంతో సదరు వ్యక్తి మృతి చెందాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman Khan  Supreme court  Hit and Run case  

Other Articles