Hawaii helicopter crash captured on video

Hawaii helicopter crash captured on video

Hawaii, Helipoter crash, canadian visitors

A Canadian family of four visiting Hawaii survived a dramatic helicopter crash in Pearl Harbor, but three are in hospital with injuries. A 15-year-old boy who was trapped underwater and had to be cut free from his seat is in critical condition.

ITEMVIDEOS: చూస్తుండగా హెలికాప్టర్ కుప్పకూలింది

Posted: 02/20/2016 08:01 AM IST
Hawaii helicopter crash captured on video

హవాయ్‌లోని పెర్ల్‌హార్బర్‌ టూరిజం సెంటర్ దగ్గర ఓ హెలికాప్టర్‌ అందరూ చూస్తుండగానే నీటిలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనను ఓ టూరిస్టు తన కెమెరాలో బంధించారు. హెలికాప్టర్‌ ఆకాశంలో ఎగురుతూ నీటిలో కుప్పకూలే వరకూ.. ఆ విజువల్స అతని కెమెరాలో రికార్డయ్యాయి. మాడిసన్‌ నుంచి శాన్‌ విన్‌రిచ్‌ అనే టూరిస్టు పెర్ల్‌హార్బర్‌ను చూసేందుకు వచ్చాడు. అక్కడి అందమైన ప్రదేశాలను తన కెమెరాతో ఫొటోలు తీస్తున్నాడు. ఇంతలో ఆకాశంలో ఓ హెలికాప్టర్‌ తమ వైపే వస్తుండటాన్ని గమనించాడు. వెంటనే తన కెమెరాలో వీడియో మోడ్‌ను ఆన్‌ చేసి ఆ విజువల్ ను రికార్డు చేయడం ప్రారంభించాడు. అయితే హెలికాప్టర్‌ అకస్మాత్తుగా కుదుపులకు గురై నీటిలో కుప్పకూలింది.

ఆ ఘటనను చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురైన శాన్‌ వీడియో రికార్డు చేయటం ఆపేశాడు. అక్కడ ఉన్న వారంతా హెలికాప్టర్‌లోని వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. హెలికాప్టర్‌లో మొత్తం ఐదుగురు ఉన్నారు. వీరిని అక్కడున్న సిబ్బంది సురక్షితంగా కాపాడి ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బెల్‌ 206 హెలికాప్టర్‌ పెర్ల్‌హార్బర్‌ విజిటర్‌ సెంటర్‌ దగ్గర కూలింది. దీనిపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hawaii  Helipoter crash  canadian visitors  

Other Articles