పాటియాలా హౌస్ కోర్టు వద్ద కన్హయ్య కుమార్ కు మద్దతు గా వచ్చిన విద్యార్థులపై దాడిచేసిన లాయర్ విక్రం సింగ్ చౌహన్ ను తోటి లాయర్లు సన్మానించారు. ఢిల్లీలోని కార్కార్ డోమా కోర్టులో లాయర్లు విక్రంసింగ్ చౌహాన్ ను తోటు లాయర్లు పూలమాలలతో సత్కరించి, హీరోగా పొగిడారు. ఢిల్లీకోర్టులో రెండు రౌండ్ల హింసాకాండలో చౌహన్ కీలక పాత్ర వహించాడు. ఈ హింసాకాండకు సంబంధించి ప్రశ్నించేందుకు పోలీసులు పిలిపించినా.. ఆయన వెళ్లలేదు. సన్మాన కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు.
లాయర్లు కూడా భారతీయ పౌరులేనని, దేశవ్యతిరేక, పాక్ అనుకూల నినాదాలు చేసేవానిని ఎలా సహించగలరు అని విక్రం సింగ్ చౌహాన్ ప్రశ్నించారు. ఇదో ఉద్యమంగా పేర్కొంటూ దేశవ్యాప్తంగా లాయర్లనుంచి మద్దతు లభిస్తోందని తెలిపారు. చౌహాన్ ఆధ్వర్యంలోనే లాయర్లు కోర్టు ప్రాంగణంలో విద్యార్థులు, రిపోర్టర్లపై దాడికి దిగారు. పోలీసులు కూడా లాయర్లను ఏమాత్రం అడ్డుకునేందుకు యత్నించకపోవడంతో రెచ్చిపోయారు. విక్రం ‘ప్రతాపం’ చూపే వీడియోలు , ఫోటోలు సోషల్ మీడియా, మీడియాలో హల్ చల్ చేయడం , పత్రికల్లో రావడంతో గుర్తుతెలియని వ్యక్తుల పై కేసు నమోదు చేశారు. కాగా జాతి వ్యతిరేక నినాదాలు చేస్తున్నవారి పట్ల తాము కేవలం అభ్యంతరం చెప్పామని చౌహన్ పేర్కొన్నారు. అల్లర్లలో తాను పాల్గొనలేదని చౌహాన్ తెలిపారు. ఎవరు దాడిచేసారో , కొట్టారో తమకు తెలియదన్నారు చౌహన్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more