Bihar woman flees from husband after he sells her to porn film makers

Less than a month after the wedding man sells wife to porn filmmakers

Dowry, Bihar, Porn, Film Making, Haryana, Husband sells wife, Human trafficking, Bihar, wife, sold, porn film makers, wife sold to porn film makers

In a horrific incident, a man in Haryana sold off his wife to porn film makers as her parents were not able to meet his dowry demands.

కట్నం కోసం భార్యను.. ‘వారికి’ తెగనమ్మిన కసాయి భర్త..

Posted: 02/17/2016 03:48 PM IST
Less than a month after the wedding man sells wife to porn filmmakers

బిహార్లో దారుణం చోటుచేసుకుంది. చేతిలో చేయి వేసి నూరేళ్లు తోడుగా ఉంటానని అందరిముందు దైవ సాక్షిగా ప్రమాణం చేసిన భర్త.. అంగీకరించిన కట్నం ఇవ్వలేదని తన భార్యను తెగనమ్మాడు. పరాయి మగాడు వెంటపడితే దండించి తన భార్యకు అండగా నిలవాల్సిన ఆ భర్త.. సభ్యసమాజం సిగ్గుపడేలా తన భార్యను నీలి చిత్రాలు తీసే వారికి అమ్మడానికి సిద్ధపడ్డాడు.  పెళ్లయి కనీసం నెలన్నర కూడా గడువక ముందే సంతలో వస్తువులా అమాయకురాలైన తన భార్యను రూ.7లక్షలకు పోర్న్ వీడియోలు తీసేవారికి అమ్మేశాడు. ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకున్న అమె పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బిహార్లోని సరాన్ జిల్లాకు చెందిన తరయా అనే గ్రామంలో రితాదేవీ(పేరు మార్చాం)కి అదే రాష్ట్రానికి చెంది హర్యానాలోని పాటికారా అనే గ్రామంలో స్థిరపడిన టికు పాటికర్ అనే వ్యక్తికి వివాహం చేశారు. అది కూడా ఈ ఏడాది జనవరి 8న వారి ఊర్లోని ఆలయంలో సాంప్రదాయ బద్ధంగా ఈ వివాహం జరిగింది. అనంతరం ఆమెను కాపురానికి హర్యానా పంపించారు. అయితే, ఆమె కాపురానికి వెళినప్పటి నుంచి ఆ కుటుంబం రాచిరంపాన పెట్టడం ప్రారంభించారు. రూపాయి కట్నం కూడా తీసుకురాలేదంటూ కొట్టడం మొదలుపెట్టారు. రూ.2లక్షల కట్నం, ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఇప్పించాలని కోరామని ఇప్పటి వరకు వాటిని ఆమె కుటుంబం ఇవ్వలేకపోయిందంటూ చిత్రహింసలు పెట్టసాగారు.

వాటన్నింటి ఆమె ఎంతో సహనంతో భరిస్తూ వచ్చింది. కానీ, ఇటీవల ఆమెకు గుండెలో దడపుట్టించే వార్త తెలిసింది. ఆమెను తన భర్త పరాయివాళ్లకు అమ్మేశాడని, వారు కూడా నీలి చిత్రాలు తీసేవాళ్లకు అని తెలిసింది. తెల్లారితే ఆమెను వాళ్లు తీసుకెళతారని తెలియడంతో రాత్రికి రాత్రే తన గ్రామానికి చేరుకుంది. జరిగిన విషయం మొత్తం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతోవారు పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  wife  husband  dowry  porn film makers  

Other Articles