smart phone only in 251 rupees

Smart phone only in 251 rupees

Smart Phone, Rining Bells, India

India's Ringing Bells has unveiled what is being touted as the country's most affordable smartphone. Dubbed Freedom 251, the Android-powered device carries a price tag of INR 251, which translates into just under $4 at current exchange rates.

స్మార్ట్ ఫోన్@ 251 రూపాయలు

Posted: 02/17/2016 01:36 PM IST
Smart phone only in 251 rupees

వేలకు వేలుపెట్టి స్మార్ట్ ఫోన్లు కొనాలనుకున్న వారికి శుభవార్త. మీరు కనీసం ఊహించని ధరలో స్మార్ట్ ఫోన్ ను అన్ని ఫీచర్లతో అందించడానికి ఓ భారతీయ కంపెనీ సిద్దమైంది.  ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్ ధర ఎంతో తెలుసా.. అక్షరాల 251 అవును రెండు వందల యాభై ఒకటి రూపాయలే. స్మార్ట్ ఫోన్లు కొత్త విప్లవానికి తెర తీశాయి అని అందరికి తెలుసు. మరి అదే స్మార్ట్ ఫోన్లను మరింత దగ్గర చేసేందుకు ఓ భారతీయ కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. నేడు లాంఛ్ కానున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించి దేశవ్యాప్తంగా చర్చసాగుతోంది. పెద్దగా ఎవరికీ తెలియని రింగింగ్ బెల్స్ కంపెనీలో గతంలో రూ. 500 కన్న తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ అందిస్తామని ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పుడు ఆ సంస్థ తమ ఫోన్‌ ధరను రూ. 251గా ఖరారుచేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు లభించే స్మార్ట్ ఫోన్‌గా ఇది నిలువనుంది.


ఇంతకీ 251 రూపాయలకే వస్తున్న స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఏంటో తెలుపా..

డిస్‌ప్లే: నాలుగు అంగుళాలు
ప్రాసెసర్‌: 1.3GHz quad-core
ర్యామ్‌: 1 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్‌: 8 జీబీ
ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ: 32 జీబీ వరకు
వెనుక కెమెరా: 3.2 మెగాపిక్సెల్
ముందు కెమెరా: 0.3 మెగాపిక్సెల్
బ్యాటరీ: 1450mAh
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smart Phone  Rining Bells  India  

Other Articles