Telangana state need A Man

Telangana state need a man

KCR, Telanaga, Opposition Leader, Telangana State, CM KCR, TDP, BJP, Congress, Revanth Reddy, Jana Reddy, Telangana Rastriya Samithi

Telangana state presently need a man who can fight aganist TRS party Praseident KCR.

తెలంగాణలో కేసీఆర్ ను ఎదుర్కొనే మగాడు కావలెను

Posted: 02/17/2016 12:56 PM IST
Telangana state need a man

అడవిలో కాచిన వెన్నెల... ఉన్నా ఒక్కటే లేకున్నా కూడా ఒక్కటే. అలాగే రాజకీయాలు అన్నాక ఖచ్చితంగా అధకార, ప్రతిపక్ష నాయకులు ఉండాలి. సైద్దాంతికంగా విభేదాలు ఉన్నా కానీ చిరవకు ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలి. కానీ కొన్ని సార్లు అలా జరగడం లేదు.. కొన్ని పరిస్థితులు అలా ఉండడానికి ఎలాంటి అవకాశాన్ని కల్పించడం లేదు. ఎప్పుడైనా సరే రెండు గీతలు ఉంటేనే ఏ గీత చిన్నదో.. ఏ గీత చిన్నదో చెప్పగలుగుతాం. అలాకాకుండా ఒక్కటే ఉంటే ఏమీ చెప్పలేము. ఏ చెట్టులేని చోట నిమ్మచెట్టే.. మహా వృక్షం కానీ అదే చెట్టు అడవిలో ఉంటే అసలు దాని సామర్థం ఏంటో తెలుస్తుంది. ఇదంతా ఎందుకు అంటే తెలంగాణలో వన్ సైడ్ లా ఉన్న రాజకీయాల గురించి. తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్ ప్రభ అప్రతిహతంగా సాగుతోంది.

తెలంగాణ ఉద్యమ నినాదంతో ముందుకు కదిలిన కేసీఆర్ చివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు చాలా కీలకంగా వ్యవహరించారు. అయితే ఉద్యమం ముగిసింది. ఇప్పుడు పరిపాలన చూడాల్సిన సమయం వచ్చింది. కానీ తెలంగాణలో కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాత్రమే ఉండేలా కేసీఆర్ చేస్తున్న చర్యలు మిగిలిన పార్టీల మనుగడ మీద నీలి నీడలు కమ్మేసింది. ఇక అంపశయ్య మీద ఉన్న పార్టీలు తమ పార్టీని కాపాడుకునే పరిస్థితి మీద దృష్టిపెట్టడంలో విఫలమవుతుండగా. మరికోన్ని పార్టీలు మాత్రం మన్ను తిన్న పాముల్లా వ్యహరిస్తున్నాయి.

రాజకీయ పార్టీల ఉద్దేశం ప్రజలకు సుపరిపాలను అందించడం. అలా అందించలేని సమయంలో ప్రజల మధ్యకు వెళ్లి ప్రత్యక్ష లేదా పరోక్ష పోరాటానికి సిద్దం కావడం. కానీ ఉద్యమ నేపధ్యంలో పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం తెలంగాణలో రాజకీయంగా మిగిలిన పార్టీలను క్లీన్ స్వీప్ చెయ్యడానికి ప్రయత్నిస్తోంది. అందుకే భారీగా వలసలకు తెర తీసింది. ఏ పార్టీ నుండి వచ్చినా కానీ తమ కారులో చోటుంది అంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాహాటంగా వెల్లడించారు. మరి ఇది ఎంత మాత్రం మంచిది. ఖచ్చితంగా ఓ పార్టీ అధికారంలో ఉంది అంటే దాన్ని ఎదుర్కునే సత్తా ఉన్న పార్టీ ప్రతిపక్ష లేదా విపక్ష పార్టీగా ఉండాలి.

కేసీఆర్ ప్రస్తుతం అజేయంగా ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. కానీ అసెంబ్లీలో కానీ మండలిలో కానీ ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఉన్న పార్టీ కానీ ముఖ్యంగా నాయకుడు మాత్రం లేకుండాపోయాడు. ఏపిలో మాత్రం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి మెజారీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కానీ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా కడిగేస్తున్నాడు.. ప్రభుత్వ విధానాలను కడిగేస్తున్నాడు. కానీ తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. కానీ కేసీఆర్ నిజానికి తప్పులు చేసినా. తెలంగాణ సర్కార్ ప్రజలకు ఆమోదం కానీ ప్రజలకు మేలుచెయ్యని కార్యక్రమాలు చేసినా కానీ కనీసం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే నాయకుడు కావాలి.. కానీ అదే ఇక్కడ కొదవ.

టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పార్టీ నుండి ఎప్పుడు ఏ నాయకుడు జంప్ అవుతాడో అని క్యాడర్ లో కూడా భయం పట్టుకుంది. పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపికి ముఖ్యమంత్రి కావడంతో అక్కడ ఉన్న సమస్యలు, సవాళ్ల కారణంగా తెలంగాణ మీద దృష్టిసారించలేదకపోతున్నారు. ఇక తెలంగాణ టిడిపి నాయకులు ఎవరైనా ముందు వరుసలో ఉన్నారా అంటూ అదీ లేదు. అంతో ఇంతో మీడియా ముందు మీసాలు తిప్పే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఎప్పుడు ఏమవుతుందో అర్థంకాని పరిస్థితి. ఇక సీనియర్లతో రేవంత్ రెడ్డి ఉన్న విభేదాలనే అదిగమించలేని రేవంత్ కేసీఆర్ ను ఎదుర్కునే సత్తా ఉన్న మగాడు కాలేడు. ఇక మిగిలిన ఎల్ రమణ, ఆర్ కృష్ణయ్య  లాంటి నాయకులు అసలు పార్టీని గాడిలో పెట్టడం కాదు కదా పార్టీలోనే ఉన్నారా లేదా అన్నట్లున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీలో మాత్రం పేరుకు సీనియర్లు ఉన్నా కానీ పార్టీని ముందు నడిపే నాయకుడు కరువయ్యాడు. అందరూ కోమట్లే కానీ కోడి మాయమైంది అన్నట్లుంది కాంగ్రెస్ పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినా కానీ కాంగ్రెస్ కు మాత్రం క్రెడిట్ దక్కలేదు. సరే తెలంగాణలో అధికారంలోకి రాకున్నా కానీ కనీసం పార్టీ క్యాడర్ ను కూడా పగ్గాలేసి కాపాడుకోలేని పరిస్థితి. జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులు ఉన్నా కానీ పార్టీకి జీవం పొయ్యడంలో మాత్రం విఫలమయ్యారు. ఇక దిగువ స్థాయి నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోతున్నారు.

తెలంగాణలో వామపక్షాల నాయకుల గురించి అయితే చెప్పడానికి ఏమీ లేదు. మీడియా ముందు మాట్లాడటానికి తప్పితే అధికారపక్షానికి చెమటలు పట్టించే పరిస్థితిలో లేవు. ఇక మిలిగిన లోక్ సత్తా, బిఎస్సీలాంటి పార్టీలు  తమ కార్యకర్తల సంఖ్యను వేళ్ల మీద లెక్కించుకోవచ్చు. తెలంగాణలో రాజకీయ పార్టీగా పవన్ కళ్యాణ్ జనసేనకు గుర్తింపు ఉన్నా కానీ పవన్ ఉలకడు పలకడు అన్నట్లున్నారు. మరి ఇన్ని సమస్యల మధ్య ప్రతిపక్షాలకు సరైన నాయకుడు లేకపోవడం తెలంగాణలో ఖచ్చితంగా వెలితి. అందుకే తెలంగాణలో కేసీఆర్ ను ఎదుర్కొనే నాయకుడు కావాలి.. అధికార పక్షం చేసే తప్పులను ఎత్తిచూపే, ప్రజలకు మరో భరోసా ఇచ్చే నాయకుడు ఖచ్చితంగా రావాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles