Medaram set to witness jana jatara

Medaram set to witness jana jatara

Medaram, Medaram Jatara, Telangana

Medaram, tucked away in deep and serene forests under SS Tadwai mandal in Warangal district, is all set to hold the first Sammakka Saralamma Jatara in Telangana state.Medaram is 110 km away from the district headquarters. All the roads are leading to the village. A huge number of devotees have already arrived at the village and more pilgrims will reach the village as the historic Jatara is to begin on Wednesday.

నేటి నుండే మేడారం వనజాతర

Posted: 02/17/2016 09:59 AM IST
Medaram set to witness jana jatara

మేడారం జాతర నేటి నుండి ప్రారంభమవుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వస్తున్న తొలి జాతరకు.. ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లుచేసింది.  రాష్ట్ర మంత్రులే స్వయంగా మేడారంలో ఉండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు కోటి మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు.. వారికి ఇబ్బందులు కలుగకుండా నిరంతరం పరిస్థితులను సమీక్షిస్తోంది. మేడారంలో జాతర ఏర్పాట్లను పరిశీలించారు రాష్ట్రమంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, చందూలాల్. భక్తులకు కల్పించిన వసతులపై ఆరా తీశారు. ఇంకా ఏం చేస్తే బాగుంటుందో భక్తుల అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మేడారం వచ్చే భక్తులు.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ నెల 19 జాతర చివరి రోజు మహాఘట్టానికి సీఎం కేసీఆర్ అటెండవుతారని చెప్పారు మంత్రులు.

మేడారం జాతరకు నిరంతర బస్సు సర్వీసులను ఏర్పాటుచేసింది ఆర్టీసీ. 51 పాయింట్ల ద్వారా 4వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. లక్షలాది మంది భక్తులకు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు 11వేల మంది సిబ్బందిని పురమాయించింది. తాత్కాలిక బస్ స్టేషన్ లను అమ్మవారి గద్దెల సమీపంలో ఏర్పాటు చేశామన్నారు ఆర్టీసీ జేఎండీ జి.వి.రమణారావు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది సర్కార్. సౌకర్యాల కల్పనలో రాజీపడే సమస్య లేదంటోంది. పోలీసులు ఉన్నతాధికారులు కూడా సెక్యూరిటీని దగ్గరుండి మానిటర్ చేస్తున్నారు.

నేటి నుంచి మేడారం జాతర ప్రారంభమవుతుండటంతో… సమ్మక్క, సారలమ్మకు సారె పంపారు నల్లమల చెంచులు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ అడవుల్లో కొలువుదీరిన భ్రమరాంబ, మల్లన్న సన్నిధిలో మహిళలు సారెను సిద్ధం చేశారు. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ఆదివాసీలు. నల్లమలలో ఉంటున్న తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన చెంచులు ఈ ఘట్టంలో పాలుపంచుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Medaram  Medaram Jatara  Telangana  

Other Articles